Viral Video : పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్ అదుర్స్.. స‌ర‌దాగా సంగీత్ సంద‌డి

Authored By mallesh | The Telugu News | Published on: July 17, 2022, 2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో ఎంత‌లా వైర‌ల్ అవుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వెడ్డింగ్ డ్యాన్స్ ట్రెండ్ న‌డుస్తోంది. నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుండ‌టంతో వీటి ప్ర‌భావం చాలామందిపై ప‌డుతోంది. దీంతో చాలామంది త‌మ పెళ్లి వేడుక‌లో డ్యాన్స్ మూమెంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్, ఫొటో షూట్ డ్యాన్స్, మండపంలో పెళ్లికూతురు డ్యాన్స్ ఇలా ఎన్నో ర‌కాల వీడియో నెట్టింట్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఈ మ‌ధ్య కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడుతుండ‌టంతో మ‌రింత పెరిగింది. అయితే చాలా మంది సరదా కోసం చేస్తుంటారు. మ‌రి కొంత మంది పబ్లిసిటీ కోసం చేస్తుంటారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండ‌పంలో, రిసెప్ష‌న్ స్టేజ్ పై చేసే డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి పీటల మీద వరుడి పక్కన సిగ్గుపడుతూ వధువు కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మార్చారు.. కొత్త ట్రెండ్ సెట్ చేశారు.

Bride Wedding Entry Dance Video

Bride Wedding Entry Dance Video

పెళ్లిలో బంధుమిత్రులతో కలిసి వధూవ‌రులు డ్యాన్స్‌లు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అంద‌రికంటే కూడా పెళ్లి కూతుళ్లే తెగ సందడి చేస్తున్నారు. వారి పెళ్లికి వారే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. నెట్టింట్లో ఇలాంటి వీడియోలే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్ర‌స్తుతం సంగీత్ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతోంది. పెళ్లి కూతురు ఎంట్రీ డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. గ్రూప్ గా చాలా మంది డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp