ఇండియాలోని ఓ గ్రామంలో వింత ఆచారం .. 5 రోజులు న*గా మహిళలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఇండియాలోని ఓ గ్రామంలో వింత ఆచారం .. 5 రోజులు న*గా మహిళలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2023,12:00 pm

ప్రతిచోట మహిళలను దేవతలుగా చూస్తారు. అందుకే స్త్రీలను గౌరవించే చోట దేవతలు తిరుగుతూ ఉంటారని అంటారు. అయితే ఒకచోట మహిళలు ఏకంగా ఐదు రోజులు బట్టలు లేకుండా న*గా ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ చిన్న గ్రామంలో ఈ వింత ఆచారం ఉంది. చాలామంది ఇలాంటి ఆచారం ఉంటుందని నమ్మలేదు. కానీ అక్కడ నిజంగానే మహిళలు ఆ ఆచారాన్ని ఇష్టపూర్వకంగానే పాటిస్తున్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. ఎవరు వారిని అలా ఉండమని ఆదేశించలేదు. వాళ్ళంతట వారే తీసుకొని పాటిస్తున్నారు. అంత ఇష్టంగా ఈ న.. దీక్షలో పాటిస్తున్నారు. ప్రపంచం టెక్నాలజీతో దూసుకెళుతున్న కొన్నిచోట్ల వింత ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారు.

వాటిలో ఈ ఊరు కూడా ఉంది. ఈ ఊరు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంది. దీని మొత్తం జనాభా 2593 మంది. ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఈ వింత ఆచారాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. పూర్వం ఇక్కడ లంగు దేవత అని ఉండేదట. ఆమె రాక్షసులను చంపి ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. అయితే ఆ దేవతను పూజిస్తూ అయిదు రోజులు నగ్న దీక్షను పాటిస్తున్నారు ఆ ఊరి ప్రజలు. దీక్షలో భాగంగా మహిళలు ఐదు రోజులు నూలు పోగులేకుండా ఉంటారు. అంతేకాదు ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఇంట్లో భర్త, భార్య నవ్వకూడదు. అలా నవ్వితే దేవతకి ఆగ్రహం వస్తుందని భావిస్తారు.

Different Village In India

ఇండియాలోని ఓ గ్రామంలో వింత ఆచారం .. 5 రోజులు న*గా మహిళలు..!

అందువలన నవ్వకుండా జాగ్రత్త పడతారు. ఐదు రోజుల వేడుకలో మొదటి రోజు దేవత రాక్షసులను చంపేసిందట. అయినప్పటికీ ఐదు రోజులు వేడుకలు చేస్తున్నారు. ఈ ఐదు రోజులు మగవారు మద్యం తాగరు. ఆ గ్రామంలోకి బయటి వారిని అనుమతించారు. దేవుడిని సంతృప్తి పరచాలంటే నైవేద్యం పెట్టొచ్చు. పండ్లు, పూలు పెట్టొచ్చు. నగ్నంగా ఎందుకు ఉండాలంటే దీనికి ఒక కారణం ఉంది. రాక్షసులు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే వారట. అప్పుడు దేవత వారిని కాపాడేదట. ఇక మరొక కారణం ఏంటంటే మినీ గ్రామము ఎప్పుడు చల్లగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు బట్టలు లేకుండా ఉండడం చాలా కష్టం. అయితే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఆ ఊరి ప్రజలు ఇలా చేస్తారట.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది