Viral video : నాన్న ముందు మందు కొడితే ఇలానే ఉంటది మరి .. ఈ వీడియో చూస్తే మామూలుగా నవ్వరు..!

Authored By aruna | The Telugu News | Published on: September 25, 2023, 9:00 pm

Viral video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాని ఉపయోగించి ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ని బయటపెడుతున్నారు. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా వాడుతున్నారు. సీరియస్ యాక్షన్, డాన్స్, ఫైట్, కామెడీ తో లైక్స్, వ్యూస్ సాధిస్తున్నారు. నెట్టింటా పాపులర్ కావాలని కొంతమంది రిస్క్ కూడా చేస్తున్నారు. కొంతమంది స్నేహితులతో కలిసి పన్నీ రీల్స్ చేస్తుంటారు. మరి కొంతమంది తమ ఫ్యామిలీతో కలిసి డ్యాన్సులు, వంటలు, చిలిపి పనులు చేస్తూ వైరల్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో నిత్యం వేలాది ఫన్నీ వీడియోలు వస్తూ ఉంటాయి. కొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మరికొన్ని మనకు దగ్గరగా అనిపిస్తాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక చిలిపి వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మామూలుగా నవ్వరు. ఈ వీడియో తండ్రీ కొడుకులకు సంబంధించినది. కొడుకు తన తండ్రిని ఫ్రాంక్ చేయాలని చూశాడు. తండ్రి మంచం మీద కూర్చొని ఎదురుగా టీవీ చూస్తున్నట్లు ఉన్నాడు. అప్పుడు కొడుకు తన తండ్రి దగ్గరగా నేల మీద కూర్చొని ఫన్నీ ఇన్సిడెంట్ చేశాడు. కొడుకు మద్యం సీసాతో తండ్రి దగ్గర కూర్చున్నాడు. తండ్రి టీవీ చూస్తూ బిజీగా ఉన్నాడు.

Father and son Frank Viral video

Father and son Frank Viral video

కొడుకు పెగ్గు కలుపుతూ ఉన్నాడు. కొడుకు చేస్తున్న పనిని తండ్రి జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అయితే నిజంగా అతను తాగేవాడు కాదు. తన తండ్రితో ఫ్రాంక్ చేయాలని ఆ ప్లాన్ వేశాడు. ఇది తెలియని ఆ తండ్రి నిజంగా తన కొడుకు తాగుతున్నాడేమో అని దగ్గరికి వచ్చి కొట్టబోయాడు. దీంతో వెంటనే తన కొడుకు నిజం కాదని ఫ్రాంక్ చేసినట్లు వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి కొందరు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరికొందరు వివిధ రకాలుగా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by @ss_king746

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp