పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు .. ఆగి ఉన్న కారులో ఐదు లక్షలు చోరీ..

Advertisement

పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారులో ఏకంగా ఐదు లక్షలు కొట్టేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు. అయితే ఇద్దరు దొంగలు అజ్మీరాను అతడి వద్ద ఉన్న డబ్బులు గ్రహించి అతడిని అనుసరిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలియని అజ్మీరా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

Advertisement

రిజిస్టర్ ఆఫీసులో పని అయిపోగానే అజ్మీర తన స్నేహితులతో కలిసి కారులో తినేందుకు బయటకు వెళ్ళాడు. ఓ రెస్టారెంట్ ముందు ఆపి కారులోనే ఐదు లక్షలు క్యాష్ ఉంచి తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్ లోకి వెళ్ళాడు. ఆ కారును ఫాలో అవుతూ వచ్చిన దొంగలు బైక్ మీద ఫాలో అవుతూ వచ్చి రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత భోజనం చేసి వచ్చాక చూస్తే కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. కారులో డబ్బు లేకపోవడం చూసి లబోదిబోమ్మన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
Five lakh stolen from a parked car
Five lakh stolen from a parked car

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కారు పార్కింగ్ చేసిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ లో ఆ దొంగలు కనిపించారు. వారు ఎవరు అనేది ఎక్కడి నుంచి వచ్చారు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్ లు ఉంటున్నాయి. ఎవరు ఏ తప్పు చేసినా అది సీసీటీవీలో కనిపిస్తుంది అని తెలిసినా కూడా దొంగలు ఇంత ధైర్యంగా దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు తెలియడం లేదు. వాళ్ళు ఎంత చేసినా చివరికి పోలీసులకు చిక్కడం ఖాయం.

Advertisement
Advertisement