Viral Video : నితిన్ పాట‌కు ఊర‌మాస్ స్టెప్పులేసిన పిల్ల‌.. అందాలు చూడ‌త‌ర‌మా..!

Authored By aruna | The Telugu News | Published on: August 12, 2022, 8:00 am

Viral Video : నార్త్ ఇండియాకు ప్రస్తుతం సౌత్ ఫీవర్ పట్టుకుందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పాటలను, నటీనటులను వారంతా తెగ ఇష్టపడుతున్నారట.. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడే ప్రకటించింది. ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలను బాలీవుడ్ వారు లెక్కచేసేవారు కాదు.కలర్ విషయంలో వివక్ష చూపించేవారు. దక్షిణభారతం నుంచి వచ్చిన వారు నల్లగా ఉంటారని, ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం కూడా రాదని వెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు పలుమార్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Viral Video : సౌత్ ఇండస్ట్రీ ఫేట్ మార్చిన పాన్ ఇండియా మూవీస్..

ఒకప్పుడు బాలీవుడ్‌లో ఖాన్‌ల త్రయం నడిచేది. వీరి సినిమాలు మాత్రమే వందల కోట్ల టర్నోవర్ వచ్చిందని గొప్పలు చెప్పుకునేవారు. సౌత్ వారికి సినిమాలు తీయడం రాదని కూడా కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు కథలు కూడా దొరకడం లేదు. ఫలితంగా అక్కడి ఫ్యాన్స్ సౌత్ నుంచి వచ్చే సినిమాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు.దీనంతటికీ బహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలే కారణం. ఈ సినిమాలు సౌత్ ఇండస్ట్రీకి ఎక్కడలేని క్రేజ్‌ను తీసుకొచ్చాయి. దీంతో నెమ్మదిగా సౌత్ యాక్టర్స్ అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ పడి చచ్చిపోతున్నారు.

girl dance for Nithiin movie song Video Viral  

girl dance for Nithiin movie song Video Viral

ఒకప్పుడు షారుక్,అమీర్, సల్మాన్ అనే వీరి నోటి వెంట.. ప్రభాస్, యష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్,విజయ్ దేవరకొండ వంటి హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్, సారా అలీఖాన్ అయితే విజయ్‌తో డేటింగ్ చేసేందుకు కూడా ఒకే చెప్పారు. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీ సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికీ మొన్న టీమిండియా స్టార్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య నితిన్ మూవీ సాంగ్ రాను రాను అంటూనే చిన్నదో సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసింది. తాజాగా నార్త్ ఇండియన్ గర్ల్స్ కూడా ఓ రేంజ్‌లో ఈ సాంగ్‌కు మాస్ డ్యాన్సులు చేసేస్తున్నారు. మొత్తానికి సౌత్ సినిమాలకు వీరు కూడా ప్రమోషన్ ఇచ్చినట్టు అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp