video viral : రోడ్డు మీద అమ్మాయి డాన్స్ .. వెనక తాగి ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ .. వైరల్ వీడియో..!
video viral : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి యువత ఎక్కువగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. రీల్స్, షాట్స్ అంటూ పబ్లిక్ గానే అన్ని పనులు చేస్తున్నారు. అబ్బాయిలు ప్రాణాంతక సాహసాలు చేస్తుంటే, అమ్మాయిలు రోడ్లమీద డ్యాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె వెనుక ఉన్న ఓ వ్యక్తి కారణంగా ఆమె ప్లాన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇది పాత వీడియోనే కానీ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి రీల్స్ కోసం రోడ్డుమీద డ్యాన్స్ చేస్తుంది. ఆమె డ్యాన్స్ చేస్తున్న ప్రదేశంలో చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు. అయితే సడన్గా ఆ అమ్మాయి వెనుక ఉన్న వ్యక్తి కూడా డాన్స్ చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి బాగా తాగి ఉన్నట్లు అతడి వాలకం చూస్తే తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎలా డ్యాన్స్ చేస్తుందో అచ్చం అలాగే అతడు కూడా ఆమె డాన్స్ ను ఫాలో అయ్యాడు. దీంతో ఈ వీడియో ఫన్నీగా సాగింది. ఇక ఈ వీడియోను అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అది కాస్త ఇలా వైరల్ గా మారింది.
ఇప్పటిదాకా ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోలో అమ్మాయి కన్నా వెనుక ఉన్న ఆ వ్యక్తి నెటిజెన్లను ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. నీ కన్నా అంకుల్ బాగా డాన్స్ చేశాడు అని కొందరు, పాపం క్రెడిట్ అంతా అంకుల్ కొట్టేశాడు అని మరికొందరు సరదాగా కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ వీడియో ఫన్నీగా సాగింది. అనుకోకుండా వచ్చిన వ్యక్తి ఇలా సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు.
View this post on Instagram