Viral Video : ఇంట్లో కొంచెం ఎక్కువ తింటెనే ఇంకెవ్వరు తినొద్దా.. మొత్తం నువ్వే తింటవా అని సరదాగా అంటుంటరు. అయితే చాలా మంది విపరీతమైన ఆకలితో ఇలా చేస్తుంటారు. మరికొంత మంది ఓ వింత వ్యాధితో బాధపడుతూ విపరీతమైన బరువు పెరుగుతుంటారు. అదేపనిగా తింటూ లావైపోతారు. అధిక బరువుతో నడవలేక.. కూర్చోలేక ఇబ్బంది పడతారు. అలాగని తినకుండా ఉండలేరు.. కడుపునిండా తింటారు. ఇలాగే బీహార్ రాష్ట్రంలోని కతియర్ జిల్లాలో రబిక్ అనే వ్యక్తి కుంబాలకు కుంబాలు లాగించేస్తున్నాడు. దాదాపు 200 కిలోల బరువు ఉన్న ఇతను రోజు తినే ఆహారం ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.
ఓ వ్యాధితో బాధపడుతున్న ఇతను నడవలేక బుల్లెట్టు బండిపై ప్రయాణిస్తుంటాడు. ఆ బరువు మోయలేక బుల్లెట్టు బండి కూడా అప్పుడప్పుడు ఆగిపోతుందంట.. ఇక ఇతను రోజుకు ఆహారంగా మూడు కిలోల రైస్, నాలుగు కిలోల చపాతీలు, రెండుకిలోల మటన్, కిలోనర చేపలు, మూడు లీటర్ల పాలు తీసుకుంటాడట. ఇక ఇందంతా వంట చేయాలంటే ఒక్కిరితో కాదని రెండు పెళ్లీలు చేసుకున్నాడట. ఇక ప్రతిరోజు ఓ ఫంక్షన్ కి వంట చేసినట్లు చేస్తున్నారట. ఇక బంధువులు ఇతరులు దావత్ లకి కూడా పిలడటం మానేశారట.
అయితే చిన్నప్పటి నుంచే ఈ సమస్యతో తల్లిదండ్రులు హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయిందట. ఇత తెగ ఆకలితో రబిక్ ఫుడ్ అంతా లాగించేస్తుండటంతో మరింత బరువు పెరిగి ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇలా ఏ పని చేయకుండా రోజు పదిమంది ఫుడ్ ఒక్కడే తినేస్తుండటంతో అంబానీ ఆస్తులు కూడా సరిపోవంటున్నారు రబిక్ గురించి తెలిసినవారు. పాపం రబిక్ సమస్య ఎప్పటికి తీరుతుందో..
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.