Viral Video : కుందేలు, తాబేలు స్టోరీని నిజం చేశారు.. ఈ పందెంలోనూ తాబేలే గెలిచింది.. వైరల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : కుందేలు, తాబేలు స్టోరీని నిజం చేశారు.. ఈ పందెంలోనూ తాబేలే గెలిచింది.. వైరల్ వీడియో

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 January 2022,8:00 am

Viral Video : మీకు తాబేలు, కుందేలు స్టోరీ గుర్తుందా? చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్నాం కదా. తాబేలు, కుందేలు.. రెండు పరుగు పందెం పెట్టుకుంటాయి. అయితే.. తాబేలు చాలా నెమ్మదిగా నడిచే స్వభావం ఉన్న జీవి. కానీ.. కుందేలు మాత్రం వేగంగా పరిగెత్తగలదు. ఇటువంటి పోటీలో ఖచ్చితంగా కుందేలే గెలుస్తుంది అంటారు కదా. కానీ.. ఆ స్టోరీలో మాత్రం తాబేలు గెలుస్తుంది. కుందేలు.. తీరిగ్గా నిద్రపోతుంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న తాబేలు.. చివరకు విజయ తీరాలకు చేరుకుంటుంది. ఈ స్టోరీ నీతి ఏంటి అంటే.. స్టో అండ్ స్టడీ విన్స్ ద రేస్.

అంటే.. తొందరపడకుండా.. ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తేనే విజయం మన సొంతం అవుతుంది అనే అర్థం వచ్చేలా ఆ స్టోరీని మనం చెప్పుకుంటాం.ఎక్కడన్నా.. తాబేలు గెలుస్తుందా? అదంతా ట్రాస్. అదంతా ఉత్త స్టోరీనే. కుందేలు ఎంత వేగంగా పరిగెడుతుంది. మనుషులకే దొరకదు. అటువంటిది.. తాబేలుతో జరిగిన పోటీలో అది ఓడిపోవడం ఏంటి.. అని అందరూ అనుకుంటారు. కానీ.. ఆ స్టోరీని వీళ్లు నిజం చేశారు. ఈ వీడియో చూస్తే.. చిన్నప్పుడు మనం చదువుకున్న ఆ స్టోరీ నిజమే అనిపిస్తుంది.

Rabbit and Tortoise running race goes viral video

Rabbit and Tortoise running race goes viral video

Viral Video : తాబేలు, కుందేలుకు పరుగుపందెం పెట్టారు

తాజాగా ఓ వీడియో , లో వైరల్ అవుతోంది. అందులో తాబేలు, కుందేలుకు పరుగు పందెం పెట్టారు. ఈ పందెంలో కూడా తాబేలే గెలవడంతో అక్కడున్న వారంతా కేరింతలు కొడతారు. తాబేలుకు అభినందనలు తెలుపుతారు. అయితే.. తాబేలు కంటే కొంత దూరం ముందుగా పరిగెత్తిన కుందేలు.. ఆ తర్వాత ఆగుతుంది. అస్సలు ముందుకు వెళ్లదు. తీరా.. తాబేలు.. చివరకు చేరుకున్నాక.. అప్పుడు కుందేలు ముందుకు వస్తుంది. అప్పటికే తాబేలు గెలుస్తుంది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

https://twitter.com/rupin1992/status/1477506754296487936?s=20

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది