Viral Video : ఇది కదా అసలైన ప్రేమ అంటే.. కోడిపెట్టె కోసం కోడిపుంజు ఎంత పరితపించిందో చూడండి

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: December 4, 2021, 11:40 am

Viral Video : ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమకు వయసు ఉండదు అంటారు. ప్రేమకు మనుషులు, జంతువులు అనే భేదం ఉండదు అంటారు. ఈ వీడియో చూస్తే నిజమే కావచ్చు అని అనుకుంటారు మీరు. చాలామంది మన మీద ప్రేమ చూపిస్తుంటారు. మన జీవితంలో ఎందరినో చూస్తుంటాం. కానీ.. కష్టాల్లో ఎంతమంది ఆదుకుంటారు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరూ నీ పక్కన ఉండరు. కానీ.. నువ్వు కష్టాల్లో లేనప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం వంద మంది నీ చుట్టే ఉంటారు.

అది నిజమైన ప్రేమ అనిపించుకోదు. నిజమైన ప్రేమ అంటే ఏంటి.. అసలు సిసలైన ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే. చూసి తీరాల్సిందే.మనుషులకేనా ప్రేమలు.. మాకు కూడా ఉంటాయి అని నిరూపించింది ఈ కోడిపుంజు. తనతో పాటు కలిసి ఉన్న కోడిపెట్టెను యజమాని వచ్చి గూటిలో వేసేందుకు ప్రయత్నించగా.. వద్దు అంటూ ఆ కోడిపుంజు అతడి కాళ్లను కసితీరా పొడిచింది.

rooster tries to save its hen video viral

rooster tries to save its hen video viral

Viral Video : కోడిపెట్టను తన నుంచి దూరం చేస్తున్నాడన్న ఆగ్రహంతో

అయినా కూడా అతడు ఆ కోడిపెట్టెను పట్టుకొని గూటిలో వేసి.. దానికి మూత పెట్టి వెళ్లిపోయాడు.ఆతర్వాత ఆ గూటికి పెట్టిన గడియను కోడిపుంజు తన నోటితో తీసేసి.. ఆ కోడిపెట్టెను గూట్లో నుంచి బయటికి వచ్చేలా చేసింది. ఆ తర్వాత రెండు కలిసి సరదాగా గడిపాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే ఆ వీడియోను చూసి అబ్బ.. ఇదిరా నిజమైన ప్రేమ అంటే.. అసలు సిసలైన ప్రేమ అంటే ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/rupin1992/status/1466202985168396289?s=20

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp