Viral Video : ఎంగేజ్ మెంట్ లో రింగ్ తొడిగి ఏం చేశాడంటే.. తెగ న‌వ్వుకున్న అమ్మాయి..

 Authored By mallesh | The Telugu News | Updated on :31 May 2022,7:40 am

Viral Video : సాధార‌ణంగా పెళ్లిలోగానీ, ఇత‌ర ఫంక్ష‌న్స్ ల‌లో గానీ ఎన్నో ఫ‌న్నీ ఇన్సిడెంట్స్ జ‌రుగుతుంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు తెలిసో తెలియ‌కో చేసిన ప‌నులు న‌వ్వులు పూహిస్తాయి. ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియోలో వంద‌ల కొద్ది ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంటాయి. ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లిల‌లో వ‌ధూవ‌రుల డ్యాన్స్ వీడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎవ‌రో ఒక‌రు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి.అయితే కొన్ని ఫంక్ష‌న్స్ లో జ‌రిగే ఫ‌న్నీ ఇన్సిడెంట్స్ తెగ న‌వ్విస్తాయి.

తెలిసో తెలియ‌కో జ‌రిగిపోయే స‌న్నివేశాలు ఒవ‌రో ఒక‌రు వీడియో తీసి తెగ వైర‌ల్ చేస్తుంటారు. అలాగే ప్ర‌స్తుతం ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తోంది. అయితే సాధార‌ణంగా ఎంగేజ్ మెంట్ లో అబ్బాయి, అమ్మాయి రింగులు మార్చుకునే కార్య‌క్ర‌మం ఉంటుంది. అయితే ఓ ఇంట్లో జ‌రిగే ఎంగేజ్ మెంట్ లో ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగింది.అయితే అబ్బాయి అమ్మాయికి కొన్ని ప‌ద్ద‌తులు తెల‌య‌క‌పోవ‌చ్చు. అందుకే పెద్ద‌వాళ్లు ఎలా చేయాలో చెప్తారు. అయితే ఇక్క‌డ రింగులు మార్చుకునే స‌మ‌యంలో అబ్బాయి అమ్మాయి కాళ్ల‌ను మొక్క‌డంతో తెగ న‌వ్వుకున్నారు.

The girl laugh With the ring in the engagement

The girl laugh With the ring in the engagement

బంధువుల స‌మ‌క్షంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి మొద‌ట అమ్మాయి అబ్బాయికి రింగ్ తొడిగి అబ్బాయి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకుంది. ఇది హిందూ సాంప్ర‌దాయంలో వెరీ కామ‌న్. అయితే అబ్బాయి కూడా అదే మాదిరి అమ్మాయికి రింగ్ తొడిగి కాళ్ల‌కు దండం పెట్టాడు. దీంతో ప‌క్క‌నే ఉన్న ఓ వ్య‌క్తి నువ్ మొక్క కూడ‌దురా అన్న‌ట్లు చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో అక్క‌డా న‌వ్వులు పూశాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి