Video Viral : బీచ్ లో ఈ అమ్మాయి చేసిన పనికి బూతులు తిడుతున్న జనం వీడియో వైరల్..!!
Video Viral : ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా పరంగా నడుస్తుంది. వాస్తవ ప్రపంచం కంటే సోషల్ మీడియా ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో చేతిలో సెల్ ఫోన్ ద్వారా రకరకాల వీడియోలు చేస్తూ గుర్తింపు సంపాదించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది తమలో ఉన్న టాలెంట్ పాట రూపంలో లేదా డాన్స్ రూపంలో.. ఇంకా డైలాగులు చెబుతూ వైరల్ అవుతున్నారు. ఏదైనా ఒక వీడియో వైరల్ అయిందంటే.. సెలబ్రిటీ […]
Video Viral : ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా పరంగా నడుస్తుంది. వాస్తవ ప్రపంచం కంటే సోషల్ మీడియా ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో చేతిలో సెల్ ఫోన్ ద్వారా రకరకాల వీడియోలు చేస్తూ గుర్తింపు సంపాదించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది తమలో ఉన్న టాలెంట్ పాట రూపంలో లేదా డాన్స్ రూపంలో.. ఇంకా డైలాగులు చెబుతూ వైరల్ అవుతున్నారు. ఏదైనా ఒక వీడియో వైరల్ అయిందంటే.. సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలో కొంతమంది గుర్తింపు సంపాదించుకోవడానికి సానుభూతిపరంగా రకరకాల పనులు చేస్తూ ఉన్నారు.
అనాధలకు ఇంకా రోడ్డు పక్కన బిక్షం అడిగే వాళ్లకి రకరకాల సహాయాలు చేస్తూ… సానుభూతి సంపాదించే రీతిలో వీడియోలు చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఈ రకంగానే యూరప్ ఖండానికి చెందిన ఓ అమ్మాయి బీచ్ ఒడ్డున నల్ల బ్యాగులలో చెత్తవెరటం జరిగింది. అయితే కెమెరాలకు ఫోజులిస్తూ దాదాపు రెండు బ్యాగులు నిండా చెత్త ఎత్తింది. ఇక్కడదాకా బాగానే ఉన్నా కానీ కెమెరా షూట్ అయిన వెంటనే ఆ రెండు బ్యాగుల చెత్తను ఆ బీచ్ ఒడ్డున పడేసి వెళ్ళిపోయింది. ఆమె చేస్తున్న ఈ వ్యవహారం మొత్తం.. మరో వ్యక్తి ఆమెకు తెలియకుండా వీడియో తీయడం జరిగింది. కెమెరాలకు ఫోజులు ఇచ్చి చెత్త ఎత్తిన ఈ అమ్మాయి తర్వాత ఆ రెండు బ్యాగులు పడటం పట్ల జనాలు మండిపడుతున్నారు.
కెమెరా గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇలాంటి చెత్త వేషాలు వేయాల.. కాస్త నడుచుకుంటూ వెళ్లి బీచ్ అవతాల పడేస్తే తప్పేముంది అని.. వీడియో కింద నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి చెత్త మనస్తత్వం కలిగిన వాళ్లు సమాజానికి చీడపురుగులని మరి కొంతమంది విమర్శిస్తున్నారు.