Tragic Boat : ఇటీవలి కాలంలో బోటు ప్రమాదాలు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కూడా పరిమితికి మించి ప్రయాణికులని ఎక్కించుకోవడం వలన బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పు కాంగోలోని కివు సరస్సులో ఘోర ప్రమాదం జరిగింది. పరిమితికి మించి జనాలు బోట్లో ప్రయాణించడంతో పడవ అదుపుతప్పి నీటి మునిగిపోయింది. ఆ పడవలో ఏకంగా 278 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటిదాకా ఏకంగా 87 మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ విషాద సంఘటన గురువారం నాడు జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ ఈ విషయం గురించి తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కిక్కిరిసిన ప్రయాణికులని అధికారులు తెలిపారు. బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలోని తూర్పు ప్రాంతంలోని కిటు ఓడరేవుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఓడ రేవుకు కొన్ని మీటర్ల దూరంలోనే ఈ పడవ మునిగిపోవడం అందరిని బాధిస్తుంది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుంచి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత సుమారు 50 మందిని రక్షించినట్లు తెలుస్తుంది.
పడవలపై రద్దీ అనేది కాంగోలో తరచూ రిపీట్ అయ్యే సమస్య. ఈ సమస్యే ఇటువంటి విపత్తులకు దారి తీస్తుంది. సముద్ర భద్రత నిబంధనలు కూడా అక్కడ పాటించరు. అందుకే ఇలాంటి ప్రమాదాలు కామన్ అయిపోయాయి. ఓడల్లో ఓవర్‌లోడింగ్ వద్దని అధికారుల చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసిన కూడా చాలా మంది ప్రయాణీకులు ఓడల ద్వారానే వెళతారట. ఎందుకంటే ప్రయాణ ఖర్చు తక్కువ. పైగా కాంగోలో రోడ్లు కూడా చాలా తక్కువట. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా నీటి రవాణాపై ఆధారపడతారు. గతంలో ఇలానే పడవ మునిగిపోవడంతో ఏకంగా 80 మంది మరణించారు. ఈ సంవత్సరం, జనవరిలో 22 మంది మరణించారు. ఇక ఏప్రిల్‌లో కివు సరస్సులో 64 మంది తప్పిపోయి ఆరుగురు చనిపోయారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా వారిలో మార్పు అనేది రావడం లేదు.
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
Gautam Adani : అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు…
This website uses cookies.