Tragic Boat : చూస్తుండ‌గానే నీట మునిగిన బోటు… 80కి పైగా మృతి, కొంద‌రు గ‌ల్లంతు..వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tragic Boat : చూస్తుండ‌గానే నీట మునిగిన బోటు… 80కి పైగా మృతి, కొంద‌రు గ‌ల్లంతు..వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :5 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Tragic Boat : చూస్తుండ‌గానే నీట మునిగిన బోటు... 80కి పైగా మృతి, కొంద‌రు గ‌ల్లంతు..!

Tragic Boat : ఇటీవ‌లి కాలంలో బోటు ప్ర‌మాదాలు మ‌నం ఎక్కువ‌గా చూస్తున్నాం. ఎన్ని హెచ్చ‌రిక‌లు చేస్తున్నా కూడా ప‌రిమితికి మించి ప్ర‌యాణికుల‌ని ఎక్కించుకోవ‌డం వ‌ల‌న బోటు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. తాజాగా తూర్పు కాంగోలోని కివు సరస్సులో ఘోర ప్రమాదం జరిగింది. పరిమితికి మించి జనాలు బోట్లో ప్రయాణించడంతో పడవ అదుపుతప్పి నీటి మునిగిపోయింది. ఆ పడవలో ఏకంగా 278 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటిదాకా ఏకంగా 87 మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Tragic Boat పెద్ద ప్ర‌మాదం..

ఈ విషాద సంఘటన గురువారం నాడు జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ ఈ విషయం గురించి తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కిక్కిరిసిన ప్రయాణికులని అధికారులు తెలిపారు. బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలోని తూర్పు ప్రాంతంలోని కిటు ఓడరేవుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఓడ రేవుకు కొన్ని మీటర్ల దూరంలోనే ఈ పడవ మునిగిపోవ‌డం అంద‌రిని బాధిస్తుంది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుంచి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత సుమారు 50 మందిని రక్షించినట్లు తెలుస్తుంది.

Tragic Boat చూస్తుండ‌గానే నీట మునిగిన బోటు 80కి పైగా మృతి కొంద‌రు గ‌ల్లంతు

Tragic Boat : చూస్తుండ‌గానే నీట మునిగిన బోటు… 80కి పైగా మృతి, కొంద‌రు గ‌ల్లంతు..!

పడవలపై రద్దీ అనేది కాంగోలో తరచూ రిపీట్ అయ్యే సమస్య. ఈ సమస్యే ఇటువంటి విపత్తులకు దారి తీస్తుంది. సముద్ర భద్రత నిబంధనలు కూడా అక్కడ పాటించరు. అందుకే ఇలాంటి ప్రమాదాలు కామన్ అయిపోయాయి. ఓడల్లో ఓవర్‌లోడింగ్ వద్దని అధికారుల చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసిన కూడా చాలా మంది ప్రయాణీకులు ఓడల ద్వారానే వెళతారట. ఎందుకంటే ప్రయాణ ఖర్చు తక్కువ. పైగా కాంగోలో రోడ్లు కూడా చాలా తక్కువట. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా నీటి రవాణాపై ఆధారపడతారు. గతంలో ఇలానే పడవ మునిగిపోవడంతో ఏకంగా 80 మంది మరణించారు. ఈ సంవత్సరం, జనవరిలో 22 మంది మరణించారు. ఇక ఏప్రిల్‌లో కివు సరస్సులో 64 మంది తప్పిపోయి ఆరుగురు చనిపోయారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జరుగుతున్నా కూడా వారిలో మార్పు అనేది రావ‌డం లేదు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది