Viral Video : చీరకట్టులో డ్యాన్స్ అదరగొట్టిన సిస్టర్స్.. వీడియో
Viral Video : అమ్మాయిలకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.. డ్యాన్స్ చేసే చాన్స్ దొరికితే అస్సలు మిస్ చేసుకోరు. ఎంతో మందికి డ్యాన్స్ చేయాలని ఉన్నప్పటికి సందర్భం రాక అలాగే ఉండిపోతారు. అయితే సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది డ్యాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇవి క్షణాల్లో వైరల్ కాగా ఇక చాలా మంది వీళ్లనే ఫాలో అవుతున్నారు. సిగ్గుపడటం మానేసి చాన్స్ దొరికితే చాలు డ్యాన్స్ చూసి ఆకట్టుకుంటున్నారు.
ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా స్టేజ్, డీజే ఏర్పాటు తప్పనిసరిగా ఉంటుంది. ఇక డీజే సాంగ్స్ కి అమ్మాయిలు ఒక్కచోట చేరి డ్యాన్స్ చేసి అదరగొడతున్నారు. ఫంక్షన్స్ లో పార్టీల్లో హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా అందంగా ముస్తాబై మాస్ స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఇంట్లో జరిగే ఫంక్షన్స్ లో అమ్మాయిలు ఫ్రెండ్స్.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి డ్యాన్స్ చేసి ఫంక్షన్ కే సందడి తీసుకొస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇంటిల్లిపాది అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు.
ముఖ్యంగా ఆడపిల్లలు అయితే డ్యాన్స్ తో తమ టాలెంట్ చూపించి సరగా తీర్చేసుకుంటారు. ప్రస్తుతం ఓ ఫంక్షన్ లో సిస్టర్స్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ చీరకట్టులో అందంగా ముస్తాబై నడుముకి వడ్డానం పెట్టి బాలీవుడ్ సాంగ్ కి డ్యాన్స్ చేసి అదరగొట్టారు. స్టేజ్ పై క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వుకుంటూ డ్యాన్స్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. మీరు కుడా ఓ లుక్కేయండి…