Viral Video : సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న తండ్రి ఉబ్బితబ్బిబయిన కొడుకు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న తండ్రి ఉబ్బితబ్బిబయిన కొడుకు..

Viral Video : కొంత మంది కొన్ని, కొన్ని చిన్న విషయాలకే ఆనందంతో పట్టలేకపోతారు. చూసే వారికి చిన్న విషయమే అయినా కానీ వారి ఆనందానికి అవధులు ఉండవు. చూసిన వారికి ఆశ్చర్యం కలిగేలా ప్రవర్తిస్తారు. అదే ఇంకా కొంత మంది తమ జీవితంలో ఎంత పెద్ద ఘటనలు జరిగినా కానీ పెద్దగా ఎమోషనల్ కారు. లైట్ తీసుకుంటారు. ఏదోలే జీవితం అలా గడిచిపోతుంది అని చెబుతారు. కానీ ఇక్కడ మనం చూసే వీడియోలో మాత్రం ఓ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 May 2022,7:00 am

Viral Video : కొంత మంది కొన్ని, కొన్ని చిన్న విషయాలకే ఆనందంతో పట్టలేకపోతారు. చూసే వారికి చిన్న విషయమే అయినా కానీ వారి ఆనందానికి అవధులు ఉండవు. చూసిన వారికి ఆశ్చర్యం కలిగేలా ప్రవర్తిస్తారు. అదే ఇంకా కొంత మంది తమ జీవితంలో ఎంత పెద్ద ఘటనలు జరిగినా కానీ పెద్దగా ఎమోషనల్ కారు. లైట్ తీసుకుంటారు. ఏదోలే జీవితం అలా గడిచిపోతుంది అని చెబుతారు. కానీ ఇక్కడ మనం చూసే వీడియోలో మాత్రం ఓ వ్యక్తి చిన్న విషయానికే ఉబ్బి తబ్బిబయిపోయాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరన్ షేర్ చేయగా.. ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మందికి చిన్న చిన్న విషయాల్లా అనిపించేవి కూడా వైరల్ అవుతుంటాయి. ఆ చిన్న పాటి వీడియోలను చూసినపుడు వారి ఆనందం పట్టలేనంతగా ఉంటుంది.

Viral Video father bought second hand bicycle son happy

Viral Video father bought second hand bicycle son happy

Viral Video : హత్తుకున్న తండ్రి కారణం అదే..

అటువంటి వీడియో గురించే మనం చర్చించుకుంటున్నాం. ఓ చోట ఓ తండ్రి సెకండ్ హ్యాండ్ సైకిల్ ను తీసుకొచ్చి దానికి పూజ చేసాడు. ఆ వ్యక్తి ఆ సైకిల్ కు దండేసి దండం పెట్టి పూజ చేశాడు. అతడి కుమారుడు ఇదంతా చూస్తూ ఆ సైకిల్ చుట్టూతే ప్రదక్షిణలు చేస్తూ అక్కడే తిరుగుతున్నాడు. చివరికి ఆ వ్యక్తి తన కుమారుడిని హత్తుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తిగా తెలియకపోయినా కానీ ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కలచి వేస్తుంది. ఈ వీడియోను అనేక మంది నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇది చూసి చాలా మంది నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది