Viral Video : ల్యాప్‌టాప్‌పై టైపింగ్ చేస్తున్న కుక్కపిల్ల.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Authored By mallesh | The Telugu News | Published on: March 18, 2022, 8:20 am

Viral Video : ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఓ పెంపుడు జంతువు ఉండటం కామన్ అయిపోయింది. కొందరు వాటిని ఏదో పెంచుకుంటున్నామా? అన్నట్టుగా చూస్తారు.. మరి కొందరు వాటి బాగోగులను ఎక్కువగా పట్టించుకుంటారు. మరి కొందరు వాటితో కలిసిపోయి ఇంట్లో ఒకరిగా గుర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మనుషుల లాగే జంతువులు సైతం మనల్ని అనుసరిస్తుంటాయి.మన చేసే పనిని అనుకరిస్తూ అవి కూడా అదే పనిని చేసేందుకు ట్రై చేస్తాయి.

ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్స్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతూ వీడియోను షేర్ చేస్తున్నారు..ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కపిల్ల ముందు బొమ్మ ల్యాప్ లాప్‌తో వర్క్ చేసినట్టు యాక్ట్ చేశాడు. కుక్క పిల్ల చూస్తుండగానే కీ బోర్డుపై ఇష్టం వచ్చినట్టుగా టైప్ చేసినట్టు నటించాడు.దాని డిస్ ప్లే పై కుక్క బొమ్మ సైతం ఉంది.

Viral Video in puppy typing on a laptop

Viral Video in puppy typing on a laptop

Viral Video : కీ బోర్డుపై ఇష్టం వచ్చినట్టు టైప్ చేస్తూ..

ఇక దానిని కుక్క పిల్లకు ఇవ్వడంతో అది కూడా ఆ బొమ్మ ల్యాప్ లాప్‌పై తన కాళ్లతో టైం చేయాలని చాలా ట్రై చేసింది. ఇష్టం వచ్చినట్టు టైపింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..

https://twitter.com/Yoda4ever/status/1503196718023602179

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp