Viral Video : క్యూట్ స్కేటింగ్.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న బుజ్జి డాగ్
Viral Video : కుక్కలు మనుషుల లాగా ఆలోచించగలవు. మనుషులు చేసే పనులను చూస్తూ ఏది ఎలా చెయ్యాలోఅర్థం చేసుకోగలవు. వాటికి కూడా సొంతంగా ఆలోచించే తెలివితేటలు ఉంటాయి. అందుకు ఎన్నో ఉదాహరణలను మనం ఇదివరకు చూశాం. కుక్కలకు విశ్వాసం ఎక్కువ అంటారు. అందుకే చాలా మంది కుక్కలను ఇష్టపడతారు. అంతేగాక వాటిని పెంచుకుంటూ ఇంటిల్లిపాది కుక్కలతో ఎక్కువగా అటాచ్‌మెంట్ పెట్టుకుంటారు. ఇక కుక్కలు కూడా అంతేలా యాజమాని పట్ల విశ్వాసాన్ని చూపిస్తుంటాయి.
కుక్కలకు ఓ ప్రత్యేక అలవాటు ఉంటుంది. ఇది వాటి సహజ లక్షణం. మనుషులతో కలిసి పెరిగే కుక్కలు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయి. ఎవరు ఏం చేస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతోంది. ఏది మంచి… ఏది చెడు అన్నది అలా చూస్తూ పసిగడుతూ ఉంటాయి. వాటికి ఉండే తెలివితేటలతో చాలా విషయాల్ని వంటబట్టించుకుంటాయి. అందువల్లే చాలా ఇళ్లలో బాల్ విసిరితే వెంటనే వెళ్లి ఆ బాల్ తెచ్చి ఓనర్‌కి ఇస్తాయి. మరికొన్ని చోట్ల ఏదైనా వస్తువును తెమ్మంటే నోటకరచుకొని తెస్తాయి.

Viral Video in buzzie dog appealing to cute skating netizens
viral video : అన్ని ఫన్నీ చేష్టలు..
అయితే కుక్క పిల్లలు, పిల్లులు, కోతులు చేసే ఫన్నీ చెష్టలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి జరిగింది. ఈ ఘటనలో ఆ కుక్క తెలివితేటలు మామూలుగా లేవు. చక్కగా డ్రెస్ వేసుకుని ఓ క్యూట్ డాగ్ దర్జాగా స్కేటింగ్ చేస్తోంది. స్లో అయినపుడు కిందకి దిగి మరి కాళ్లతో నెడుతూ స్కేటింగ్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతూ లైకులు కొడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మీరుకూడా చూసేయండి లేటెందుకు..
https://twitter.com/FredSchultz35/status/1507791178762178567