Viral Video : ఫుల్ గా తాగి ట్రాఫిక్ పోలిస్ పై రెచ్చిపోయాడు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఫుల్ గా తాగి ట్రాఫిక్ పోలిస్ పై రెచ్చిపోయాడు వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :4 March 2023,6:00 pm

Viral Video : హైదరాబాద్ వంటి నగరాలలో చాలామంది తప్ప తాగి ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ అనేక ప్రమాదాలకు కారణం అవుతూ ఉన్నారు. మామూలుగానే హైదరాబాద్ అంటే ట్రాఫిక్. ఈ క్రమంలో తాగి మరి డ్రైవ్ చేసే తాగుబోతులు… బెడద కారణంగా చాలామంది ప్రమాదాలకు గురవుతూ ఉండటంతో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ.. తాగుబోతులను పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దొరికినవరిలో కొంతమంది ఫైన్ కట్టడానికి రెడీ అవుతుంటే మరి కొంతమంది పోలీసులపై గొడవలకు దిగుతున్నారు.

Viral Video Man Over Action on Traffic Police

Viral Video Man Over Action on Traffic Police

తాగిన మైకంలో ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. ఇక అదే సమయంలో పక్కన అమ్మాయి ఉంటే మత్తులో ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని రీతిలో భాషలో దుర్భాషలు చేస్తున్నారు. ఈ రకంగా ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో… ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి ట్రాఫిక్ పోలీసులకీ దొరికిపోవడం జరిగింది. దీంతో పోలీసులపై రెచ్చిపోయాడు. తనకి నేలకి 70 వేల రూపాయల జీతం అని.. ఆపితే హైకోర్టులో తేల్చుకుంటానని నానా బూతులు తిట్టాడు. ఇక ఇదే సమయంలో ఆ తాగుబోతు కారులో మరో అమ్మాయి కూడా పక్కనే కూర్చున్న క్రమంలో ఆమె…

Drunken Man Over Action on Traffic Police | Drunk and Drive in Hyderabad  |@SakshiTV - YouTube

తాగుబోతుని సపోర్ట్ చేస్తూ ఉంది. సదరు తాగుబోతు అడ్డంగా దొరికిపోవడంతో పాటు పోలీసుల దగ్గర ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే మిషన్ నీ విసిరేయడం జరిగింది. పోలీసుల మీదకి కూడా వెళ్లడానికి సిద్ధపడ్డాడు. తాను లాయర్ అని హైకోర్టులో తేల్చుకుంటానని.. రెచ్చిపోయాడు. ఇదే సమయంలో పోలీసులను వెనక్కి కూడా తోసేయడం జరిగింది. తన నెంబర్ తీసుకుని పంపించేయాలని అడ్డొస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తాగుబోతు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈ ఘటనకి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది