Viral Video : రోడ్డుపై రన్నింగ్ బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన ఇద్దరమ్మాయిలు.. వీడియో వైరల్..!!

Advertisement

Viral Video : సమాజంలో గుర్తింపు సంపాదించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయి అబ్బాయిలు బైకులపై విన్యాసాలు చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ ఇటీవల వీడియోలు చేయటం వైరల్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి. కానీ ఇద్దరు అమ్మాయిలు మాత్రం సరికొత్త ట్రెండ్ సృష్టించాలనుకున్నారో ఏమో తెలియదు గానీ..

కొత్తగా ఆలోచన చేశారు. మగవాళ్లకు తామేమి తీసుపోలేదని నిరూపించేందుకు రెడీ అయ్యారు. బైక్ రన్నింగ్ లో ఉండగానే కౌగిలించుకొని లిప్ కిస్ పెట్టుకునే రకరకాల వింత చేస్టలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాగా నెగిటివ్ కామెంట్లు రావడంతో వెంటనే వీడియో డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇది డిలీట్ చేసే సమయానికే 30 వేల లైకులు, 5 లక్షల 74 వేలకు పైగా వీక్షించారు. అయితే ఆ బైక్ తమిళనాడు నంబర్ ప్లేట్‌తో కనిపించగా..

Advertisement
Viral Video Two girls excited by ks on a running bike on the road
Viral Video Two girls excited by ks on a running bike on the road

ఇది జార్ఖండ్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయినట్లు తెలుస్తోంది. నంబర్ ప్లేట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను నెట్టిజెన్లు కోరుతున్నారు. బైకుపై ఉన్న యువతులు చాలా టీనేజ్ పిల్లలు లాగా కనిపిస్తూ ఉండటంతో ముందు లైసెన్స్ అడగాలని తర్వాత బైక్ ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని నేటిజన్స్ మండిపడుతున్నారు.

Advertisement
Advertisement