Viral Video : నాటు నాటు సాంగ్ తో దుమ్ము లేపిన‌ ఫ్యామిలీ..పెళ్లిలో డ్యాన్స్ వీడియో వైర‌ల్

 Authored By mallesh | The Telugu News | Updated on :12 April 2022,1:00 pm

Viral Video: సోషల్ మీడియాలో కొంచెం కొత్త‌గా ఏది చేసినా వైర‌ల్ అవ‌డం ఖాయం. ఏ మూలన ఏం జరిగినా వైరల్ అయిపోతోంది. కాగా ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే పద్దతి ప్రకారం జరిగేవి. మండపం మీద పెళ్లి జరుగుతుంటే.. వచ్చిన అతిథులంతా పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలేవాళ్లు కాదు. కానీ.. ఇప్పుడు పెళ్లి అంటే.. సంప్రదాయం కంటే ఎక్కువగా సందడికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెళ్లికి వచ్చిన బంధువుల దగ్గర నుంచి వధూ వరుల వరకు అందరూ డ్యాన్స్ లు వేయడం సందడి చేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది.

సంగీత్ అని మెహందీ పార్టీ అని ఇలా ఏది జ‌రిగినా డ్యాన్స్ చేయడం కామ‌న్. అలాగే వ‌ధూవ‌రులు కూడా స్టెప్పులేస్తుంటారు. మ‌రి కొన్ని చోట్ల పెళ్లి కూతురు మండ‌పానికి వ‌స్తూ డ్యాన్స్ చేసిన వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి.ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఏ పాట వచ్చిన చిటికెలో ట్రెండ్ అవుతోంది. ఆ మ‌ధ్య ఏ పెళ్లిలో చూసినా.. నీ బుల్లెట్లు బండెక్కి వ‌చ్చేత‌పా.. అనే సాంగ్ వినిపించేది. పెళ్లికి వ‌చ్చిన బంధువ‌లు, ఫ్రెండ్స్ ముఖ్యంగా అమ్మాయిలు తెగ చిందులేసేవారు. ఇంతకుముందు కూడా పెళ్లిళ్లలో చేసిన చాలా వీడియోలు వైరల్ గా మారాయి. ఈ మధ్య ఓ పెళ్లి కూతురు స్టేజిపైనే చిందులేసింది.

Wedding Natu Natu Song Dance Video Viral 

Wedding Natu Natu Song Dance Video Viral

వరుడు ముసిముసిగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వీడియో కూడా నెటిజన్లకు తెగ నచ్చింది.ఇక ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు.. నాటు.. సాంగ్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచే ట్రెండింగ్లో ఉంది. అయితే ఆ క్రేజ్ ని కొందరు అబ్బాయిలు పెళ్ళిలో డాన్స్ రూపం లో చూపించారు. పెళ్లి లో నాటు నాటు పాటకి కుటుంబం మొత్తం చిందులేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా డాన్స్ తో అదరకొట్టారు కుటుంబ సభ్యులు. ఇక ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. నాటు నాటు స్టెప్స్ కి వారు వేయడానికి ఎంత గానో ప్రయత్నించారని నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి