Viral Video : బుల్లెట్ సాంగ్‌కు యువతి డ్యాన్స్.. నెటిజన్‌ల ఫిదా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : బుల్లెట్ సాంగ్‌కు యువతి డ్యాన్స్.. నెటిజన్‌ల ఫిదా..!!

 Authored By mallesh | The Telugu News | Updated on :7 June 2022,7:40 am

Bullet Song: సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే ట్రెండింగ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి రీల్స్‌గా పెట్టాలి. ప్రస్తుతం యువత అంతా ఇదే జపం చేస్తోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో మంది రీల్స్ చేస్తున్నారు.

అలా బుల్లెట్ సాంగ్ ఫేమస్ అయిపోతోంది. తాజాగా బుల్లెట్ సాంగ్‌కు ఓ యువతి చేసిన డ్యాన్స్ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. షర్ట్, నిక్కర్, వైట్ షూస్ వేసుకున్న ఓ యువతి బుల్లెట్ సాంగ్‌కు నడుము ఊపుతూ చేసిన డ్యాన్స్ నెటిజన్‌లను ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ది వారియర్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను సమకూర్చాడు.

Young woman dancing to a bullet song video

Young woman dancing to a bullet song video

ప్రముఖ దర్శకుడు లింగుసామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. గతంలో సరైనోడు, అజ్ఞాత వాసి లాంటి సినిమాల్లో ఆది పినిశెట్టి విలన్‌ రోల్స్‌లో కనిపించాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ అతడు రామ్‌కు పోటీగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Spv (@preethivarma)

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది