AP CM Race : 2029 సీఎం.. ఆ నలుగురిలో ఎవరా ఒక్కరు..?
ప్రధానాంశాలు:
AP CM Race : 2029 సీఎం.. ఆ నలుగురిలో ఎవరా ఒక్కరు..?
AP CM Race : 2024 ఎలక్షన్స్ ఈమధ్యనే ముగిసి చంద్రబాబు సీఎం గా ఎంపికయ్యారు. కూటమి ప్రభువం అధికారం లోకి వచ్చి ప్రజా పాలన షురూ చేసింది. ఓ పక్క డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మంత్రిగా లోకేష్ తమ మార్క్ పాలన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరోపక్క అధికారం కోల్పోయిన వైఎస్ జగన్ ఐదేళ్ల తర్వాత విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కూడా అక్కడ పార్టీ బలోపేతానికి నడుం బిగించింది.ఐతే 2029 ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభవం ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఐతే సీఎం సీటులో ఎవరెవరికి అర్హత ఉంది అన్నది మాత్రం గెస్ చేయొచ్చు. టీడీపీ మళ్లీ అధికారం లోకి వస్తే వారసుడిని సీఎం చేయాలని బాబు దాదాపు పథకం సిద్ధం చేశారు. ఇక ఈసారి డిప్యూటీతో సరిపెట్టుకున్న పవన్ నెక్స్ట్ టైం సీఎం అవుతాడనే టాక్ కూడా ఉంది. ఐతే పవన్ నెక్స్ట్ టర్మ్ సీఎం అవుతాడా లేదా అన్నది ఈ ఐదేళ్ల ఆయన పాలన చూసి డిసైడ్ చేస్తారు.
AP CM Race సీఎం రేసులో అన్నా చెల్లి ప్రత్యర్ధులుగా
ఇక ఓడిన వైసీపీ కూడా 2029 గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ లో ఓడినా 40 శాతం ఓటింగ్ పర్సెంటేజ్ రావడంతో అధికారం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మనదే అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నాడు వైఎస్ జగన్. ఐతే అనూహ్యంగా జగన్ కి కాంగ్రెస్ రూపంలో కొత్త సమస్య వచ్చి పడుతుంది.
నెక్స్ట్ టర్మ్ కాంగ్రెస్ కూడా ఏపీలో బలంగా వినిపించేలా ఉంది. కాంగ్రెస్ గెలిస్తే షర్మిలానే సీఎం. ఈమధ్య తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి షర్మిలానే సీఎం కాండిడేట్ అని చెప్పకనే చెప్పారు. సో కాంగ్రెస్ ఏపీలో గెలిస్తే కొత్త అధ్యాయం మొదలైనట్టే లెక్క. ఇలా 2029 ఎన్నికల్లో ఈ నలుగురు గెలవడమే కాదు అధికారం చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారు. మరి 2029 లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి.