AP Next CM YS Jagan : మళ్లీ ఏపీ సీఎం జగనే.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడి సంచ‌ల‌నం..!

Advertisement

AP Next CM YS Jagan : ఏపీ ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరో సంవత్సరంలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎ జగన్ పాలన పూర్తి చేసుకొని నాలుగేళ్లు అయింది. అన్ని పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని టీడీపీ బలంగా ప్రచారం చేస్తోంది. అందుకే తాము 160 సీట్లు గెలుస్తామని టీడీపీ పార్టీల నేతలు చెబుతున్నారు.మరోవైపు ఎన్ని కష్టాలు ఉన్నా సరే.. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. లబ్దిదారులే తమను గెలిపిస్తారని వైసీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు.

Advertisement

అయితే.. పలువురు జ్యోతిష్యులు కూడా ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తమ లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. ఇలాంటి ఓ జ్యోతిష్యుడే రుద్ర కరణ్ ప్రతాప్. ఉత్తరాదికి చెందిన ఈయన సాదాసీదా వ్యక్తి కాదు. ఈయన చాలా ఫేమస్ వ్యక్తి. ఆయన పలు రాజకీయ నాయకుల గురించి చెప్పిన జ్యోతిష్యం నూటికి నూరు శాతం నిజమైంది.ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ముందే చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ముందే చెప్పడంలో ఆయన దిట్ట. ఏపీ ఎన్నికల గురించి కూడా ఆయన జ్యోతిష్యం చెప్పారు. ప్రస్తుతం ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ గెలువబోతుందని ప్రకటించారు.

Advertisement
Again next AP cm of andhra pradesh Ys Jagan
Again next AP cm of andhra pradesh Ys Jagan

AP Next CM YS Jagan : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా ఆయన చెప్పారు

ఈ విషయాన్ని ఆయన నేరుగా తన ట్విట్ చేశారు. మరోసారి ఏపీ సీఎంగా జగన్ కాబోతున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. మరి.. ఈయన చెప్పిన జ్యోతిష్యం నిజం అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement