Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా విడుదల… మహిళా ఓటర్లే అధికం…ఆందోళనలో కూటమి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా విడుదల… మహిళా ఓటర్లే అధికం…ఆందోళనలో కూటమి…!

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా విడుదల... మహిళా ఓటర్లే అధికం...ఆందోళనలో కూటమి...!

Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ లో మరో 10 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఇటీవల వెళ్లడైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేశారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వీరిలో పురుష ఓటర్ల విషయానికొస్తే దాదాపు 2,03,39,851 మంది పురుష ఓటర్లు ఉండగా 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే పురుషులకంటే మహిళా ఓటర్లు 7,18,764 మంది ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

Andhra Pradesh Voters : అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ…

అంతేకాక రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే154 నియోజకవర్గాలలో కూడా మహిళా ఓటర్ల ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం అనేది కూటమిని కాస్త భయాందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో మహిళలకు ఎక్కువగా సంక్షేమాలు అందిస్తూ వారిని తన ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నాడు.

Andhra Pradesh Voters : మహిళా పక్షపాతి జగనన్న…

అంతేకాక దాదాపు లక్ష మంది గృహినీలకు సొంతింటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలను కూడా వారి పేరుతోనే అందించాడు జగన్. దీంతోపాటు అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలను కూడా జగన్ ప్రభుత్వం మహిళల ఖాతాలోకి పంపుతూ వచ్చింది. అలాగే డ్వాక్రా రుణాలను మాఫీ చేసి డ్వాక్రా మహిళల పాలిట జగన్ శ్రేయోభిలాషిగా మారిపోయారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మహిళా పక్షపాతి అనే ముద్ర వేయించుకోగలిగారు.దీంతో ఎన్నికల్లో వైయస్ జగన్ కు అధిక మొత్తంలో మహిళల ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే.

Andhra Pradesh Voters ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా విడుదల మహిళా ఓటర్లే అధికంఆందోళనలో కూటమి

Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా విడుదల… మహిళా ఓటర్లే అధికం…ఆందోళనలో కూటమి…!

Andhra Pradesh Voters : నమ్మకద్రోహిగా చంద్రబాబు…

ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ చంద్రబాబు నాయుడుని నమ్మకద్రోహిగా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చేయలేదు. అదేవిధంగా మహిళలు బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారాన్ని ఇంటికి తీసుకొస్తానని నమ్మించి ఆ తర్వాత అందరిని నట్టేట ముంచారు. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని నమ్మించి మోసగించే నాయకుడిగా గుర్తుపెట్టుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమికి ఇది ఎదురు దెబ్బ అని చెప్పాలి. అంతేకాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన రాజకీయపరంగా కూటమికి ఇది ఆందోళన కలిగించే విషయం. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీపార్టీ ఆనందంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలు సర్వేలలో 60 శాతం మంది మహిళలు వైసీపీ పార్టీకే ఓటు వేస్తారని వేళ్లడైంది. దీంతో ఈ సర్వేలన్నీ కూడా కూటమిని పెద్ద ఎత్తున కలవరపెడుతున్నాయి. అంతేకాక మరోసారి అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగడంతో పాటు , ఇంకాస్త ఎక్కువగా సంక్షేమం అందిస్తామని జగన్ ప్రభుత్వం చెప్పడంతో మహిళల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో జగన్ చెబితే చేస్తాడు అనే నమ్మకంతో మహిళలు కచ్చితంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో ఇదే జరిగితే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది