10th Class Results : 10th ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయంటే !
ప్రధానాంశాలు:
10th Class Results : 10th ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయంటే !
10th Class Results : ఆంధ్రప్రదేశ్‌లో AP 10th class results పదో తరగతి (SSC) పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 17న ప్రారంభమైన ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 3న జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా, ఏప్రిల్ 9న ఈ ప్రక్రియ పూర్తయ్యింది. తాజా సమాచారం ప్రకారం.. పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

10th Class Results : 10th ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయంటే !
10th Class Results : మరో పది రోజుల్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు..?
మూల్యాంకనం ముగిసిన వెంటనే ఫలితాలను కంప్యూటరైజ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. పలు దశల్లో వడపోత ప్రక్రియ పూర్తయ్యాక, అధికారికంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యాశాఖ త్వరలోనే అధికారిక ఫలితాల తేదీని ప్రకటించనుంది. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ని ఉపయోగించి ఫలితాలను తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు.
ఇదిలా ఉండగా ఇంటర్ ఫలితాల విషయంలోనూ ఆసక్తికర సమాచారం అందించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12 (శనివారం) ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇంటర్ ఫలితాలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. విద్యార్థుల సౌకర్యం కోసం అన్ని ప్రక్రియలూ త్వరితగతిన సాగుతున్నాయని అధికారులు తెలిపారు.