Dwakra womens : డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం..ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dwakra womens : డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం..ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

 Authored By suma | The Telugu News | Updated on :19 January 2026,11:00 am

ప్రధానాంశాలు:

  •  Dwakra womens : డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం..ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Dwakra womens : డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Central and state governments వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మహిళలు స్వయం ఉపాధి ద్వారా నిలదొక్కుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లాలోని డ్వాక్రా ఎస్సీ మహిళలకు ఊహించని స్థాయిలో లాభం చేకూర్చే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం అందించడమే కాకుండా అందులో రూ.50 వేల వరకు రాయితీ (సబ్సిడీ) కూడా ఇవ్వనుంది. ఈ అవకాశం జిల్లాలోని అర్హత కలిగిన ఎస్సీ మహిళలకు మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం.

Dwakra offers interest free loans of up to Rs 3 lakh for women Who is eligible How to apply

Dwakra womens : డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం..ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Dwakra womens: పీఎం–అజయ్ పథకం కింద ప్రత్యేక అవకాశం

ఈ వడ్డీ లేని రుణాలు Interest Free Loans ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన PM-AJAYపథకం కింద మంజూరు చేయనున్నారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం లక్ష్యం ఎస్సీ వర్గాల సామాజిక, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం. ముఖ్యంగా పేదరికం తగ్గించడం ఉపాధి అవకాశాలు పెంచడం మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్సీ మహిళల జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఈ పథకం కింద 130 యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనిట్ల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించనున్నారు. ఈ మేరకు ఏపీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ SERPసీఈవో అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Dwakra womens: ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

. ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని కీలక అర్హతలు ఉండాలి.
. దరఖాస్తుదారు డ్వాక్రా పొదుపు సంఘానికి చెందిన ఎస్సీ మహిళ అయి ఉండాలి.
. వయస్సు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
. శ్రీసత్యసాయి జిల్లాకు చెందినవారై ఉండాలి.

కాగా అర్హత ఉన్న మహిళలు తమ మండలాల్లోని మహిళా సమాఖ్యలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ మహిళల జనాభా ప్రాతిపదికన మండలాల వారీగా యూనిట్లను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అర్హులైన మహిళలను ఎంపిక చేసి వారికి అవసరమైన మార్గదర్శకత కూడా అందించనున్నారు.

Dwakra womens: స్వయం ఉపాధికి విస్తృత అవకాశాలు

ఈ వడ్డీ లేని రుణాలను మహిళలు పలు రకాల స్వయం ఉపాధి కార్యక్రమాల Self-employment programs కోసం వినియోగించుకోవచ్చు. ఆటోలు కొనుగోలు చేయడం బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయడం చీరలు–దుస్తుల వ్యాపారం ప్రారంభించడం చిన్న కేఫ్‌లు, శీతల పానీయాల యూనిట్లు ఇతర చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా రూ.50 వేల వరకు సబ్సిడీ ఉండటం వల్ల మహిళలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ పథకం ద్వారా మహిళలు కేవలం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబ ఆదాయాన్ని పెంచుకుని సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. ఎస్సీ వర్గాల్లోని పేదరికాన్ని తగ్గించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే పీఎం–అజయ్ పథకపు ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లాలోని డ్వాక్రా ఎస్సీ మహిళలకు ఇది నిజంగా ఎగిరి గంతేసే శుభవార్తగా నిలుస్తోంది.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది