YS Jagan : వై.యస్.షర్మిలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : వై.యస్.షర్మిలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!!

YS Jagan : అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధులు విడుదల సభలో మాట్లాడారు. అన్ని జెండాలు కలిసొస్తే అది అజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని తెలిపారు. ప్రజలకు ఏ మంచి చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఎంతో మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,9:00 pm

YS Jagan : అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధులు విడుదల సభలో మాట్లాడారు. అన్ని జెండాలు కలిసొస్తే అది అజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని తెలిపారు. ప్రజలకు ఏ మంచి చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఎంతో మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరని అయితే మీ బిడ్డ వాళ్ళెవరిని నమ్ముకోలేదని, వీళ్ళందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని జగన్ అన్నారు. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్క చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడుకి ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నా , నాకున్నంతమంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు. రాజకీయ చరిత్రలో ఎవరికీ ఉండరన్నారు. ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని అన్నారు. ఓటు వేసే ముందు నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని అన్నారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవడం కాదు పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేందుకని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు నాయుడుకు ఆయన ఎల్లో మీడియాకు ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదని, చెడు చేసిన చరిత్ర వారిదని ఎప్పుడూ మోసాలే.

చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వీరందరికీ ఒక దత్త పుత్రుడు తోడు అని ఇటువంటి వారికి రోజు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందని, నిజంగా ఇది కలికాలం అని సీఎం వై.ఎస్.జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలామంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకొని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్ళందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. పక్క రాష్ట్రంలో పరిమినెంట్ రెసిడెంట్ గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్ పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు.

అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వీళ్లంతా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు అని అన్నారు. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టి పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా ఆయనకి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు మనుషుల్లో ఇతర పార్టీలో రకరకాల రూపాల్లో బినామీలుగా, చంద్రబాబుకు స్టార్ క్యాంపెనర్ లో ఉన్నారు. టీవీలో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మేధావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లంతా బాబు కోసం పనిచేస్తారు. కారణం దోచుకోవడం పంచుకోవడంలో వీళ్ళందరూ భాగస్వాములని సీఎం జగన్ నిప్పులు చెరిగారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక