Ap Govt New Pensions : కొత్త పించన్లకి మార్గదర్శకాలు ఇవే.. వచ్చే నెల నుండి కొత్త దరఖాస్తుల స్వీకరణ..!
Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లబ్ధి దారులు. ఏపీ రాష్ట్ర ప్రజల పింఛన్ల పంపిణీల అవకతవకలను నివారించే క్రమంలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానంలో పింఛన్లు అందించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఏపీలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పింఛన్ పంపిణీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకు నేరుగా చేరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న వారికి […]
ప్రధానాంశాలు:
Ap Govt New Pensions : కొత్త పించన్లకి మార్గదర్శకాలు ఇవే.. వచ్చే నెల నుండి కొత్త దరఖాస్తుల స్వీకరణ..!
Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లబ్ధి దారులు. ఏపీ రాష్ట్ర ప్రజల పింఛన్ల పంపిణీల అవకతవకలను నివారించే క్రమంలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానంలో పింఛన్లు అందించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఏపీలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పింఛన్ పంపిణీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకు నేరుగా చేరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న వారికి కొత్త ఫించన్లను వచ్చే జనవరి నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు మార్గదర్శకాలు సిద్దం చేసారు.
Ap Govt New Pensions ఇవే మార్గదర్శకాలు..
పెన్షన్ పొందుతున్న అనర్హులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వారికి ఫించన్లు రద్దు చేస్తూ..అర్హత ఉన్న వారికి అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. జనవరిలో జన్మభూమి -2 ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామ సభల్లో కొత్త ఫించన్లు పంపిణీ మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది.కొత్త ఫించన్ల పంపిణీకి సంబంధించి అధికారులు మార్గదర్శకాలు సిద్దం చేస్తున్నారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద సంఖ్యలో పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నాలుగు నెలల కాలంలో వారిని ప్రభుత్వం గుర్తించింది.
దివ్యాంగ పెన్షన్ల లో నకిలీ లబ్దిదారులు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. చేనేత ఫించన్లలోనూ అర్హత లేకుండానే లబ్ది పొందుతున్న వారిని గుర్తించారు.కొత్త ఫించన్ల కోసం కొత్తగా దరఖాస్తుల స్వీకరణ పైనా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. వచ్చే నెల నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించనున్నారు. అదే విధంగా అర్హులను గుర్తించి గ్రామ సభల్లోనే ప్రకటన చేయనున్నారు. మొత్తం విధాన పరమైన ప్రక్రియ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జనవరిలో కొత్త ఫించన్ల అమలు ప్రారంభించేలా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను నివారించి పారదర్శకంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.