Chandrababu Naidu : యెల్లో బ్యాచ్ ని ఏకిపారేసిన ఏపీ మహిళ… గుర్రాలతో తొక్కించిన సిగ్గు రాలేదా… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : యెల్లో బ్యాచ్ ని ఏకిపారేసిన ఏపీ మహిళ… గుర్రాలతో తొక్కించిన సిగ్గు రాలేదా… వీడియో !

 Authored By aruna | The Telugu News | Updated on :16 January 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : యెల్లో బ్యాచ్ ని ఏకిపారేసిన ఏపీ మహిళ... గుర్రాలతో తొక్కించిన సిగ్గు రాలేదా...!

Chandrababu Naidu : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడి కార్యకర్తలు జీతాలు పెంచకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నాలను జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాక జగన్ ప్రభుత్వం కిందికి దిగి రాకుండా చట్టం ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశాల గురించి మాట్లాడడానికి వైఎస్ఆర్సిపి నాయకురాలు బుచ్చి గారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అంగన్ వాడీలు ధర్నాలు చేస్తున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అడగగా ఆమె మాట్లాడుతూ….ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు చేస్తున్న ధర్నాలకు కొంచమైన న్యాయం ఉందా అని ఆలోచిస్తే …వారి ఎబిలిటీని బట్టి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకున్నట్లయితే దానిలో చెప్పడానికి వచ్చే టీచర్లు ఏ క్వాలిఫికేషన్ ద్వారా వస్తున్నారు. వారు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు. వారు ఎంత జీతాలు తీసుకుంటున్నారనే విషయాలు గురించి కచ్చితంగా ఆలోచించాలి.ఇక అంగన్వాడీ టీచర్ల దగ్గరికి వచ్చేసరికి వీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు. ఎంతమంది పిల్లల్ని చూసుకుంటున్నారు. మీరు ఏ క్వాలిఫికేషన్ ద్వారా జాబ్ లోకి వచ్చారు అనే విషయాలను పరిగణలోకి తీసుకొని కంపేర్ చేసి చూసినట్లయితే ఎవరి ఎబిలిటీకి తగినట్లుగా వారికి సాలరీలు ప్రభుత్వం డిసైడ్ చేసింది.

అదేవిధంగా గత ప్రభుత్వం కేవలం 3000 రూపాయలు ఇచ్చి వారితో వెట్టి చాకిరి చేయించుకుని గుర్రాలతో తొక్కించి నాన రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది చంద్రబాబు గవర్నమెంట్. కాని తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఆడబిడ్డలు 3 వేల తో బతుకులేరని ఆలోచించి జగనన్న ఇప్పుడు ఏకంగా వారికి 10 నుండి 11 వేలు ఇస్తుంటే ఇప్పుడు వీళ్ళకు మాత్రం జగన్ అంటే లెక్కలేకుండా పోయిందని చెప్పాలి. నిజంగా ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వారు మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలి. 3000 ఉన్న వేతనాన్ని ఒకేసారి 10000 కు పెంచింది ఎవరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీరు తీసుకునే సాలరీకి మీరు చేసే పనికిి మీ ఎబిలిటీకి సరిపోతుందా లేదా అనేది మీరే ఒకసారి చెక్ చేసుకోవాలి అని ఆమె తెలియజేశారు.ఈ క్రమంలోనే యాంకర్ మరో ప్రశ్న అడగడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు సాలరీ ఎం పెంచలేదు. పెంచింది మొత్తం చంద్రబాబు అని కొందరు అంటున్నారు కదా జగన్ కేవలం 1500 మాత్రమే పెంచారు అని కొందరు అంటున్నారు కదా అని అడిగాడు.

ఇక దీనికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ అలా ఏం లేదు గత ప్రభుత్వంలో వీరందరూ తీసుకున్న జీతం 3000 మాత్రమే. జగనన్న వచ్చిన తర్వాతనే ఆశ వర్కర్లకి అంగన్వాడి టీచర్లకు స్టెప్ బై స్టెప్ జీతాలు పెంచారని చెప్పుకొచ్చారు.అనంతరం యాంకర్ మరెందుకు వైసిపి కార్యకర్తలు ధర్నాలు చేస్తున్న వారితో సంప్రదింపులు జరిపి ఈ విషయాల గురించి చర్చించడం లేదని అడిగాడు. దీనికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ ఇది అంగన్వాడీ టీచర్లు కావాలని చేస్తున్నది కాదని రాజకీయంగా కొందరు పార్టీ నేతలు వారిని రెచ్చగొట్టి తీసుకొస్తున్నారని ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలుగా వారు ఎలాంటి ధర్నాలు చేయకుండా సడన్ గా ఇప్పుడు చేస్తున్నారంటే కచ్చితంగా దీని వెనక ప్రత్యర్థి పార్టీల హస్తం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది