AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు..!
ప్రధానాంశాలు:
ఏపీలో మళ్లీ అమల్లోకి రాబోతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం
AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు..!
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ అమలు చేయబోతుంది. సహజ విపత్తుల కారణంగా పంటలకు జరిగే నష్టానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. తుపాను, వరదలు, అకాల వర్షాలు, కరవు వంటి అనుకోని పరిస్థితుల్లో రైతులకు భద్రత కల్పించేలా దీన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఈ పథకం పాంప్లెట్‌ను విడుదల చేసి, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు..!
AP farmers ఏపీ రైతులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి అచ్చెన్నాయుడు
ఈ పథకం ద్వారా రైతులు తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా ప్రయోజనం పొందవచ్చు. సాధారణ పంటలకు 2 శాతం, వాణిజ్య లేదా ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వరి, మొక్కజొన్న, నువ్వులు, పత్తి వంటి పంటలకు ఈ బీమా వర్తిస్తుంది. పంట నష్టం జరిగితే, నష్టాన్ని అంచనా వేసిన వెంటనే బీమా సంస్థలు మొత్తం బీమా పరిహారంలో 25 శాతాన్ని తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి. ఈ విధానం రైతులకు వేగవంతమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
దరఖాస్తు ప్రక్రియను చాలా సులభంగా రూపొందించారు. రైతులు బ్యాంకులు, ప్యాక్స్‌లు, మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు అంటే భూమి యాజమాన్య రికార్డులు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ, విత్తన ధృవీకరణ పత్రం వంటివి సమర్పించాలి. ఖరీఫ్ 2025–26 సీజన్‌కు దరఖాస్తు చివరి తేదీ జూలై 31, 2025. అలాగే, “ఫసల్ బీమా సప్తాహ్” కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సరైన సమాచారం, సమయానికి అప్లికేషన్‌తో ఈ పథకం ద్వారా రైతులు తమ భవిష్యత్తును బలోపేతం చేసుకోవచ్చు.