Atchannaidu : ఇప్పుడు టీడీపీకి దిక్కు పవన్ కళ్యాణ్ మాత్రమే.. ఆయన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఊరుకోను.. అచ్చెన్నాయుడు ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Atchannaidu : ఇప్పుడు టీడీపీకి దిక్కు పవన్ కళ్యాణ్ మాత్రమే.. ఆయన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఊరుకోను.. అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu : ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. అలాగే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఈ రాష్ట్రానికి ఆస్తి. ఈ రాష్ట్ర యువతకు భవిష్యత్తు. ఈ రాష్ట్ర యువతని దేశంలోనే అగ్రగామిగా తయారు చేయాలని ఒక మహానుభావుడు తపన పడి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెట్టి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 November 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ప్రధాని మోదీయే మెచ్చుకున్నారు

  •  యువత కోసం తీసుకొచ్చిన స్కీమ్ ను స్కామ్ గా మార్చారు

  •  జగన్ కు చరమగీతం త్వరలోనే పాడాల్సిందే

Atchannaidu : ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. అలాగే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఈ రాష్ట్రానికి ఆస్తి. ఈ రాష్ట్ర యువతకు భవిష్యత్తు. ఈ రాష్ట్ర యువతని దేశంలోనే అగ్రగామిగా తయారు చేయాలని ఒక మహానుభావుడు తపన పడి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెట్టి కొన్ని లక్షల మందికి అవకాశం ఇస్తే అందులో అవినీతి జరిగిందని.. అరెస్ట్ చేయడం ఇది న్యాయమా? నిన్న ప్రధాన మంత్రి ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. అది చూసి అయినా ఈ జగన్ మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. స్కిల్ డెవలప్ మెంట్ ఈ దేశానికి వరం. నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ లో చేశాను. ఈరోజు రెండు, మూడు రాష్ట్రాల్లో చేస్తున్నారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ కు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి డెవలప్ మెంట్ చేస్తామని దేశ ప్రధాని చెబుతుంటే.. అటువంటి కేసులో మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు.. అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

మనందరం ఒక పక్కన అక్రమ ఆస్తిని ఖండించాలి. చంద్రబాబు నాయడు గారు కడిగిన ముత్యంలాగా మళ్లీ దర్జాగా బయటికి వచ్చేంత వరకు పోరాటం చేయాలి. ఇంకో పక్కన రేపు జరుగుతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధపడాలి. వీడు డ్రామాలు ఆడుతున్నాడు. వీడి ప్లానంతా చంద్రబాబును జైలులో వేస్తే తెలుగుదేశం పార్టీ మళ్లీ లేవదని, కార్యకర్తలు బయటికి రారని.. ఒక భ్రమలో ఈ కార్యక్రమం చేసి మొత్తం బూమరాంగ్ అయిపోయాడు. రేపు వైసీపీ పార్టీకి, నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. అందుకే.. అధ్యక్షలు అరెస్ట్ అయ్యారు కాబట్టి మనమంతా అదే పనితో ఉంటే మనం నష్టపోతాం. మనం పోరాటం చేయాలి. కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధపడాలి. అతి ముఖ్యమైన టీమ్ ఇక్కడ కూర్చొన్నాం. చాలామంది అనుకుంటున్నారు.. ఎన్నికలు ఇప్పుడు లేవు కదా అని అంటున్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ 150 రోజులే గుర్తుపెట్టుకోండి. ఇంకా 5 నెలలు మాత్రమే ఉన్నాయి. మనందరి మైండ్ లో ఎన్నికలకు 150 రోజులే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి రోజు, ప్రతి నిమిషం మనకు విలువైనదని గుర్తుపెట్టుకోవాలి. దీనికి రెమిడీ ఇంకోటి లేదు.. మనందరం నిరంతరం ప్రజల మధ్యన ఉండాలి.. ప్రతి ఇంటి తలుపు తట్టాలి అన్నారు.

Atchannaidu : ఏ నిర్ణయం తీసుకున్నా జనసేనతో కలిసి వెళ్లాలి

ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి చెప్పాలి. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ విధంగా భ్రష్టుపట్టించిందో డోర్ టు డోర్ మనం చెప్పగలిగితే మనం విజయం సాధిస్తాం. దీనికి తోడు మనకి జనసేన పార్టీ కరెక్ట్ టైమ్ లో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని జతకట్టింది. అధికారం ముఖ్యం కాదు.. రాజకీయం ముఖ్యం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని.. ఈ జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు వెళ్లగొట్టాలనే మంచి హృదయంతో పవన్ కళ్యాణ్ నాయకుడిని కలిసి మనకు సంఘీభావం తెలిపి కలిసి వెళ్దామని, కలిసి పోటీ చేద్దామని ఆయన కూడా ముందుకు వచ్చారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా జనసేనతో కలిసి వెళ్లాలి అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది