Nandamuri Mokshagna : రాజకీయాల్లోకి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ.. నారా లోకేష్ అడుగుజాడల్లో నడవనున్నాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nandamuri Mokshagna : రాజకీయాల్లోకి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ.. నారా లోకేష్ అడుగుజాడల్లో నడవనున్నాడా?

Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తెలుసు కదా. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ లో బాలయ్య కొడుకు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. మోక్షజ్ఞ కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. తన తాతలా రాజకీయాల్లోకి రావాలని బాలయ్య కొడుకు అనుకుంటున్నారట. అందుకే రాజకీయాల్లో కూడా పాలుపంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఏ రాజకీయ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న మోక్షజ్ఞ

  •  పాదయాత్రలో పాల్గొన్న దేవాన్ష్

  •  నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న నారా బ్రాహ్మణి

Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తెలుసు కదా. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ లో బాలయ్య కొడుకు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. మోక్షజ్ఞ కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. తన తాతలా రాజకీయాల్లోకి రావాలని బాలయ్య కొడుకు అనుకుంటున్నారట. అందుకే రాజకీయాల్లో కూడా పాలుపంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఏ రాజకీయ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ.. ఇటీవల మళ్లీ ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మెరిశాడు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా బ్రాహ్మణి, చంద్రబాబు మనవడు దేవాన్ష్ తో పాటు బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తో కలిసి పాల్గొన్నారు.

నందమూరి మోక్షజ్ఞను యువగళం పాదయాత్రలో చూసిన టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేశారు. తాతలా బాలయ్య కొడుకు రాజకీయాల్లో రాణించాలని అంటున్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న బాలయ్య బాబు కొడుకును చూడటానికి జనాలు భారీగా పాల్గొన్నారు. నారా లోకేష్ అడుగు జాడల్లో నడుస్తూ బాలయ్య కొడుకు చేసిన యువగళం పాదయాత్రకు మంచి క్రేజ్ వచ్చింది. చాలామంది అయితే.. మోక్షజ్ఞను చూడటానికి ఎగబడ్డారు. టీడీపీ నేతలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత నారా లోకేష్, తన కొడుకు దేవాన్ష్ తో కలిసి కాసేపు పరిగెత్తాడు.

Nandamuri Mokshagna : మోక్షజ్ఞ రాజకీయాల్లోకి రావాలి

మోక్షజ్ఞ రాజకీయాల్లోకి రావాలని.. రాజకీయాల్లో ఆయన పాలుపంచుకోవాలని.. టీడీపీ పార్టీకి యువరక్తం అవసరం ఎంతో ఉందని.. అందులో భాగంగానే ఖచ్చితంగా మోక్షజ్ఞ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి తన బావ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో మోక్షజ్ఞ రాణిస్తారా లేదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది