Nandamuri Chaitanya Krishna : చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది బాలకృష్ణే.. నందమూరి చైతన్యకృష్ణ వ్యాఖ్యలు వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nandamuri Chaitanya Krishna : చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది బాలకృష్ణే.. నందమూరి చైతన్యకృష్ణ వ్యాఖ్యలు వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :22 November 2023,4:41 pm

ప్రధానాంశాలు:

  •  బాలకృష్ణ తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు

  •  నందమూరి చైతన్యకృష్ణ వ్యాఖ్యలు వైరల్

  •  సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్న చైతన్యకృష్ణ

Nandamuri Chaitanya Krishna : ఇంతకీ ఈ నందమూరి చైతన్యకృష్ణ ఎవరు అంటారా? ఆయన ఎవరో కాదు.. బాలకృష్ణకు కొడుకు వరస అవుతాడు. అంటే.. బాలకృష్ణ.. ఆయనకు బాబాయి అవుతాడు. బాలకృష్ణ అన్న, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు నందమూరి జయకృష్ణ కొడుకే ఈ చైతన్యకృష్ణ. ఈయన కూడా ఈ మధ్య సినిమాల్లోకి వచ్చారు. బ్రీత్ అనే ఒక సినిమా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే నందమూరి ఫ్యామిలీలో హైలెట్ అవుతున్న మరో హీరో చైతన్య కృష్ణ అని చెప్పుకోవచ్చు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో చైతన్యకృష్ణపై వైసీపీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. అసలు బాలకృష్ణ సీఎం ఎలా అవుతాడు.. బాలకృష్ణ తర్వాత లోకేష్ ఎలా అవుతాడు. లోకేష్ తర్వాత నువ్వు కూడా సీఎం అవుతావని చెప్పాల్సింది అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో చైతన్యకృష్ణపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. వీడికి ఇంకా పిచ్చి తగ్గలేదేంట్రా, నీ మొహం చూసుకోరా అద్దంలో ఒకసారి నువ్వు కూడా ఆ మెంటల్ బాలి మొగ్గ గాడివే అంటూ నెటిజన్లు అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మాకు ఇదే కావాలి.. సీఎం అయితే రోజూ దొరుకుతాడు.. డెయిలీ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఏంట్రా వీడు బయట ఇంత కామెడీ చేస్తుంటే సినిమాల్లో ఇంకా చింపుతాడు అంటూ తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్.. మామూలుగా లేదు. ఆయన ఏదో మాట వరసకు అని ఉంటాడు కానీ.. నెటిజన్లు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది