Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!
ప్రధానాంశాలు:
Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది నిజం అయింది. వైసీపీకి రాజీనామా చేయడానికి గల కారణాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కొన్ని కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యంగా పార్టీలో కోటరీ నడుస్తోందని.. ఇది తనను తీవ్రంగా బాధించిందన్నారు. తనపై అనేక వదంతులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కాంగ్రెస్‌లో పిల్ల కాంగ్రెస్ విలీనం అవుతుందని తాను అనని మాటలను అన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు.తాను జగన్ ముందు ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదన్నారు. ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పానని.. వాటిని ఆయన నెగిటివ్‌గా తీసుకున్నారని అన్నారు.
Balineni Srinivas Reddy బాలినేని సంచలన నిర్ణయం..
ఒంగోలు ఎంపీ టికెట్‌ను మాగుంటకు ఇవ్వాలని కోరానని.. కానీ పెద్ద నాయకులుగా చెప్పుకునే చెవిరెడ్డికి ఇచ్చారన్నారు. ఎక్కడో చిత్తూరు నుండి తిసుకువచ్చి ఒంగోలులో నిలబెట్టారని, ఇది తప్పుడు నిర్ణయమని అన్నారు. ఇక డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు బాలినేని. జనసేనలో చేరికపై కీలక మంతనాలు జరపనున్నారు. అయితే జనసేనలో చేరేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఒకవేళ అనుమతి ఇస్తే ఆయన చేరిక ఎప్పుడు?, జనసేన జెండాను ఎప్పుడు కప్పుకుంటారు? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపేందుకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇవాళ వెళ్లనున్నారు.
చర్చల అనంతరం ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. బాలినేని చేయనున్న ప్రకటనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జనసేనలో చేరికపై సంకేతాలు వచ్చినప్పటికీ పవన్‌తో భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన ఉంటుందనే ఆసక్తికరంగా మారింది. జగన్‌కు వరుసకు బాబాయి అయిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాస రెడ్డి బావమరిది. దగ్గరి బంధుత్వం కావటంతో జగన్‌తో అవినాభావ సంబంధాల కారణంగా చాలాకాలం ఆ పార్టీలో పనిచేశారు. జగన్ సర్కారులో మొదటి రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయనను జగన్ తప్పించారు