Balineni Srinivas Reddy : జనసేన చేరిక.. బాలినేనికి కొత్త తలనొప్పి తయారవుతుంది..!
ప్రధానాంశాలు:
Balineni Srinivas Reddy : జనసేన చేరిక.. బాలినేనికి కొత్త తలనొప్పి తయారవుతుంది..!
Balineni Srinivas Reddy : వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైంది. పవన్ సమక్షంలో జనసేనలోకి చేరుతున్న బాలినేని వైసీపీ పట్ల అసంతృప్తి వల్ల రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేశాడని తెలిసిందే. త్వరలో జనసేనలో చేరబోతున్న బాలినేనికి జనసేన నుంచి కేవలం ఆయన ఒంటరిగా వచ్చి పార్టీలో కవాలని.. ఎలాంటి బల ప్రదర్శన చేయవద్దని జనసేన హైకమాండ్ సూచించింది. దానిపై సర్వత్రా చర్చకు దారి తీస్తుంది. జనసేనలో చేరడం అవసరంగా భావిస్తున్న బాలినేని పార్టీలో చేరాక తన కనుసన్నల్లోనే అంతా జరగాలని కోరుతారు.
వైసీపీలో కూడా ప్రకాశం జిల్లా నాయకత్వాన్ని అడిగి పార్టీ టికెట్ల విషయంలో కూడా తన ఇన్వాల్వ్ మెంట్ ఉండాలని చూశారు. అందుకే జగన్ ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. అందుకే ఆయన నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన పార్టీ మారడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తుంది.
బాలినేని వైసీపీలో అసంతృప్తిగా ఉనారు. అయినా సరే ఆయన్ను వదులుకునేందుకు జగన్ ఇష్టం లేకపోయినా తప్పలేదు. పరిస్థితులను బట్టే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పారు. తన మనుగడ కోసమే జనసేనలో చేరుతున్నట్టు అర్ధమవుతుంది. బాలినేని వ్యవహార శైలి ఎలా ఉన్నా జనసేనలో తాను చెప్పిందే జరుగుతుందని పవన్ స్పష్టంగా చెబుతున్నారు. అందుకే పార్టీ చేరే కార్యక్రమాన్ని ఎలాంటి హడావిడి లేకుండా చూడాలని అంటున్నారు.
జగన్ మంత్రివర్గ విస్తరణలో బాలినేని తప్పించడం వల్ల అసంతృప్తి పెరిగింది. ఆ టైం నుంచి నిరసన వాద్న వినిపిస్తూ వచ్చారు. ఇక ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇవ్వకపోవడంతో పాటు తనకు పార్టీలో అంత ప్రాముఖ్యత లేకపోవడం వల్ల వైసీపీ వీడారు. ఐతే ఇప్పుడు జనసేనలో కూడా బాలినేనికి అదే పరిస్థితి ఏర్పడేలా ఉంది. మరి ఆయన ఏం చేస్తారన్నది చూడాలి. జనసేనలో చేరిక బాలినేని రాజకీయ భవిష్యత్తుకి ఎలా సహకరిస్తుంది అన్నది చూడాలి.