Bhuma Akhila Priya : భూమా అఖిల ప్రియ రౌడీయిజం మొత్తం బయటకి తీసింది !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 18, 2023, 8:00 am

Bhuma Akhila Priya : ఏపీ రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. నంద్యాల రాజకీయాలు మరో ఎత్తు అని చెప్పుకోవాలి. జిల్లాలోని టీడీపీ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏపీ సుబ్బారెడ్డిపై టీడీపీకి చెందిన వాళ్లు దాడి చేశారు. ఆయనపై దాడి చేసింది ఎవరో కాదు.. భూమా అఖిలప్రియ వర్గీయులు. వాళ్ల దాడిలో సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

సుబ్బారెడ్డిపై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండించారు. లోకేశ్ పాదయాత్ర ప్రస్తుతం జరుగుతోంది కదా. ఆ యాత్రలో తమ బలం నిరూపించుకునేందుకే ఆయనపై దాడి చేశారని.. సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి టీడీపీలో ఉన్న వర్గపోరు మరోసారి బయటపడింది.అసలే ఎన్నికల కాలం. ఇంకో సంవత్సరంలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో నంద్యాలలో ఇలా వర్గపోరు బయటపడటం పార్టీకి ఎంతైనా మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి.

Akhila Priya

Akhila Priya

Bhuma Akhila Priya : ఎన్నికల సమయంలో ఈ గొడవలు ఏంటి?

ఇది వైసీపీకి ప్లస్ కాబోతోంది. టీడీపీకి పట్టు ఉన్న నంద్యాలలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఏపీలో టీడీపీ నేత లోకేష్ పాదయాత్ర సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో నంద్యలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం టీడీపీకి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. టీడీపీలో తమ బలాన్ని చూపించుకోవడం కోసమే ఒక వర్గం మీద మరో వర్గం దాడి చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో?

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp