Chandrababu Naidu : జగన్ ని ఓడిస్తా.. పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తా.. కానీ ఒక కండిషన్.. చంద్రబాబు నాయుడు..!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : జగన్ ని ఓడిస్తా.. పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తా.. కానీ ఒక కండిషన్.. చంద్రబాబు నాయుడు..!
Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ కోలాహలం నెలకొంది. తొలి రోజు అయినా భోగి పండుగ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. భోగిమంటలు, సంక్రాంతి ముగ్గులతో పల్లెటూర్లు సందడిగా మారిగాయి. పట్టణాల్లో కూడా ప్రజలు వేకువ జామునే లేసి భోగి మంటలు వేశారు. ఇక తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడిగా భోగి వేడుకలను నిర్వహించాయి. గుంటూరు జిల్లా మందడంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో జనసేన, టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్, వర్ల రామయ్య, మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి స్వర్ణ యుగం సంక్రాంతి సంకల్పం అనే కాన్సెప్ట్ తో ఈ వేడుకలను నిర్వహించారు.
తొలుత చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ భోగిమంటలను వెలిగించారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టో కాపీలు, కొన్ని జీవోలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. నాగలి, చెర్నాకోళి, కోడిపుంజును పట్టుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. సమాజ శ్రేయస్సు రాష్ట్రంలో ప్రగతిని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి సంకల్పాన్ని తీసుకున్నామని ఈ రాష్ట్రం నుంచి వైయస్సార్ సీపీ ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం ఈ ప్రాంత రైతులు 33 వేల ఎకరాలను నాటి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అలాంటి రైతులను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు.
రైతులందరికీ తాము మాట ఇస్తున్నామని, వారి త్యాగాన్ని విస్మరించబోమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ ఉద్దేశం కోసం పంట పొలాలను అందజేశారో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేలా కృషి చేస్తామని, బంగారు రాజధాని నిర్మిస్తామని తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం త్యాగం చేసిన త్యాగాన్ని వృధాగా పోనివ్వమని అన్నారు. జై ఆంధ్ర జై అమరావతి అంటూ నినాదాలు కూడా తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత రైతులకు సూచించారు. జై అమరావతి అని చెప్పడం వల్ల ఇక్కడికి సమస్య రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావట్లేదని, అదేదో ఈ ప్రాంత సమస్యగా భావిస్తున్నారు అని చెప్పారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెడగొట్టారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. సరిగ్గా 87 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. అమరావతి ప్రాంత రైతుల హక్కులను పరిరక్షించాలని ఈ సంక్రాంతి సంకల్పం తీసుకున్నామని ఎన్నికల తర్వాత దీన్ని అమలు చేస్తామని తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని తెలిపారు.