Good News : గుడ్‌న్యూస్.. త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.15,000 జమ..!
ప్రధానాంశాలు:
Good News : గుడ్‌న్యూస్.. త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.15,000 జమ..!
Good News : ఆంధ్రప్రదేశ్ లో కూటమి జోరు పెంచింది. సూపర్ సిక్స్‌లో హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిగాయి. కూటమి ప్రభుత్వ పాలన చూసి వైఎస్సార్‌సీపీ బాధపడిపోతుందని.. ప్రజాస్వామ్యం, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన కూటమి ఇది అంటూ కొందరు నాయకులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం “అన్నదాత సుఖీభవ”, “తల్లికి వందనం” అనే రెండు పథకాలు ప్రభుత్వ అజెండాలో కీలకంగా ఉన్నాయి.

Good News : గుడ్‌న్యూస్.. త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.15,000 జమ..!
Good News తల్లులు హ్యాపీ..
తల్లికి వందనం పథకంపై ప్రజల్లో భారీగా చర్చ నడుస్తోంది. ఈ పథకం ఎప్పుడు అమలులోకి వస్తుంది? ఎంత మొత్తం ఇవ్వబడుతుంది? అనే సందేహాలు ఉండగా, సీఎం చంద్రబాబు తాజాగా సమాధానం ఇచ్చారు.తల్లికి వందనం పథకాన్ని మే నెలలోనే ప్రారంభిస్తామని స్పష్టంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయని సమాచారం.
సీఎం చేసిన ఈ ప్రకటనతో విద్యార్థుల తల్లులు, కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాట ప్రకారం నిలబడుతుందని నమ్ముతున్నారు.ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ సహాయం ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లులకు లభించనుంది. అయితే ఈ మొత్తం ఒకసారి జమ చేస్తారా, లేదంటే రెండు సార్లు జమ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.