MLC Condidates : ఏపీ ఎమ్మెల్సీ రేసులో ఉన్నది ఎవరు.. ఏకగ్రీవమే అవుతుందా..?
MLC Condidates : ఏపీలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే టైం వచ్చింది. ప్రస్తుత ఎమ్మెల్సీలుగా ఉన్న రామచంద్రయ్య, ఇక్బాల్ ల ప్లేస్ లో కొత్త ఎమ్మెల్సీలను తీసుకునేలా నోటిఫికేషన్ వచ్చింది. ఐతే 164 స్థానాలు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు బలపరిచే ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరన్నది కాస్త సస్పెన్స్ గా ఉంది. ఐతే ముందు తాము పోటీ చేయాల్సిన సీటును త్యాగం చేసిన వారికే ఇస్తారు.
ఈ ఎమ్మెల్సీ రేసులో పిఠాపురంలో తన సీటు పవన్ కోసం ఇచ్చేసిన ఎస్.వి.ఎన్ వర్మ ముందు ఉన్నాడని తెలుస్తుంది. దాదాపు ఎమ్మెలేయ్లు అంతా కూడా వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎంపిక విధానంలో పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు తెలుసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఎమ్మెల్సీ రేసులో రెండో అభ్యర్ధిగా ముస్లీం మైనార్టీకి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఐతే రాయలసీమ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ కే మళ్లీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
MLC Condidates ఎమ్మెల్సీ నిర్ణయం కూడా కూటమి కలిసే
ఈ ఎమ్మెల్సీ ఎంపిక కూడా కూటమి అంటే టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీ సలహాలు తీసుకుంటున్నారట. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇక్బాల్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడే ఇద్దరు ఎమ్మెల్సీలు దాదాపు ఖారారైనట్టే అని చెప్పుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో వర్మ ఎమ్మెల్సీ కన్ ఫర్మ్ అయితే పవన్ కోసం ఆయన చేసిన త్యాగానికి న్యాయం జరిగినట్టు అవుతుందని జనసైనికులు అంటున్నారు.