Chandrababu : జగన్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జగన్ ముఖాన కట్టి రాష్ట్రమంతా తిప్పుతానన్న చంద్రబాబు..!
ప్రధానాంశాలు:
Chandrababu : జగన్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జగన్ ముఖాన కట్టి రాష్ట్రమంతా తిప్పుతానన్న చంద్రబాబు..!
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో కేంద్రం నుంచి తీసుకువచ్చిన మెడికల్ సీట్లను ఇప్పుడు కాదంటూ చంద్రబాబు తిప్పిపంపుతున్నారని.. ఇటీవల మాజీ సీఎం జగన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మొత్తంగా 8 పాయింట్లతో కూడిన ట్వీట్‌ను ఆయన పోస్టు చేశారు. తాము ఎంతో కష్టపడి మెడికల్ సీట్లు తెచ్చామని.. దీని వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని.. వైద్య కళాశాలలతోపాటు.. ఆసుపత్రులు కూడా అందుబాటులోకి వస్తాయని.. రాష్ట్రంలోని పేదలు ఇక్కడే వైద్య విద్యను చదువుకునేందుకు అవకాశం ఉందన్నారు.అయితే.. చంద్రబాబు ప్రభుత్వం తాము గతంలో ఇచ్చిన జీవోను కూడా పక్కన పెట్టి వైద్య కలాశాలల సీట్లను తమకు అవసరం లేదంటూ వెనక్కి పంపుతోందని జగన్ ఆరోపించారు.
Chandrababu దిక్కుమాలిన జీవో..
ఇదేం విధానమని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అన్ని వైద్య కళాశాలలను నిర్మిస్తామని.. మరిన్ని తీసుకువస్తామని చెప్పిన చంద్రబాబు ఇలా చేయడం సబబేనా అని జగన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయని, సీట్ల సంఖ్య తగ్గిపోతోందని జగన్ ఆరోపిస్తున్నారు… దీనికి మీరేమంటారు? అని ఆ రిపోర్టర్ చంద్రబాబును అడిగారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ… “ఆయనొక జీవో ఇచ్చాడు. ఆ జీవోను ఆయన ముఖానికి కట్టి రాష్ట్రమంతా తిప్పుతా. సూటిగా అడుతున్నా… ఏం అమలు చేశాడో ఆయనను చెప్పమనండి. ఆయన ఏ జీవో ఇచ్చాడో, ఆ జీవోను మీడియా ప్రతినిధులు కూడా చదివి తెలుసుకోవాలి.
ఇలాంటి నేరస్తులకు నేను చెప్పేది ఏంటంటే… బాబాయ్ ని చంపి నారాసుర రక్తచరిత్ర అని పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అనునిత్యం జరగవు అవన్నీ. తప్పుడు పనులన్నీ చేసి వేరేవాళ్లపై తోసేయాలని చూస్తే అవి జరగవు. ఆ రోజులు అయిపోయాయి. పిచ్చి పిచ్చిగా చేస్తే ఆ జీవోను చెవికి కట్టి చూపిస్తాను… ఊరంతా తిప్పుతా. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? నిన్న ఏం చేశారో మర్చిపోయి, దానిపై వాళ్లే ఇవాళ విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి మీరే చదవండి… నేను చెప్పను. చెబితే రహస్యం అందరికీ తెలిసిపోతుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో ఆయన ఏమని జీవో ఇచ్చాడో మీరే చదవాలి. వీళ్లు మాట్లాడే మాటలకు నేను ఇరిటేట్ కావాల్సిన పనిలేదు. ఇరిటేట్ అవ్వడం వల్ల వచ్చేదేమీ లేదు. వీళ్లు చెల్లని కాసులు! వీళ్లు ఇలాంటివే చేస్తారు. అప్పట్లో రాజులు యజ్ఞాలు చేసేవాళ్లు… రాక్షసులు వచ్చి చెడగొట్టే వాళ్లు. ఇదొక నిరంతర ప్రక్రియ. మేం కూడా పోరాడుతూనే ఉంటాం” అని చంద్రబాబు వివరించారు.