Chandrababu : తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుండటంతో తొలిసారి స్పందించిన చంద్రబాబు.. జగన్ కు మాస్ వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుండటంతో తొలిసారి స్పందించిన చంద్రబాబు.. జగన్ కు మాస్ వార్నింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :2 December 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  నాపై దాడి జరిగినప్పుడు వేంకటేశ్వర స్వామే కాపాడాడు

  •  నేను ఏ పని చేసినా ముందు శ్రీవారికే పూజలు చేస్తా

  •  వేంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం అని చెప్పిన చంద్రబాబు

Chandrababu : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలోనూ ఎన్నికల హడావుడి మొదలైందనే చెప్పుకోవాలి. తెలంగాణ ఎన్నికలు ముగియడంతో ఇక అందరి చూపు ఏపీపై పడింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వచ్చే సంవత్సరం ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో జరిగినట్టుగానే జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా మాట్లాడారు. నేను ప్రజాసేవకే అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఆయనకు పూజలు చేసే మేము అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తాం. 2003 లో దేవుడికి సంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు నా మీద దాడి జరగడంతో సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామే నన్ను కాపాడారు. అందుకే అప్పటి నుంచి ఆయన్ను దర్శించుకున్న తర్వాతనే ఏ పని అయినా మొదలు పెడుతాను అని చెప్పారు చంద్రబాబు.

వెంకటేశ్వర స్వామిని నేను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను. ఆయన్ను తలుచుకునే నా పనులు ప్రారంభిస్తాను. ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటాను. కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అందుకే ఆయన్ను నేను ఎప్పుడూ భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటాను. అలాగే తెలుగు జాతి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలని నేను కోరుకుంటాను. తెలుగు ప్రజానికం ఎప్పుడు అన్ని విషయాల్లో ముందుంటారు. వెంకటేశ్వర స్వామికి బలంగా కోరుకున్నాను. ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపి ఏ సంకల్పం అయితే మీరు నాతో చేయించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం శక్తిని ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాను అని చెప్పారు.

Chandrababu : నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ప్రజలు సంఘీభావం తెలిపారు

నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ప్రజలంతా వారి సంఘీభావాన్ని తెలిపారు. వాళ్లకు కూడా ధన్యవాదాలు తెలిపాను. నా సంకల్పం చాలా స్పష్టంగా ఉంది. నేను 45 ఏళ్లుగా ప్రజల కోసం పాటుపడ్డాను. ప్రపంచంలో ఉన్నవన్నీ నేను భారతదేశంలోకి రావాలని.. తెలుగు ప్రాంతాలకు రావాలని కోరుకున్నాను. భవిష్యత్తులో నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని నేను కోరుకున్నాను. తెలుగు వారు ఎక్కడున్నా కూడా వారు ముందుండాలి. ఈ సంకల్పం కోసం పని చేస్తున్నా అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది