TDP Mahanadu : మహానాడు వేదిక పై పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
ప్రధానాంశాలు:
TDP Mahanadu : మహానాడు వేదిక పై పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కొందరు కార్యకర్తలు నిజమైన నాయకులమని నటిస్తూ ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఈ కోవర్టులు పార్టీ లోపలే ఉండి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, ఇది సహించదగిన విషయం కాదని చంద్రబాబు స్పష్టం చేసారు.

TDP Mahanadu : మహానాడు వేదిక పై పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
TDP Mahanadu : టీడీపీ లో కోవర్టులు..అసలు నిజం తెలుసుకున్న చంద్రబాబు
ఈ కోవర్టులు ప్రత్యర్థి పార్టీ నాయకుల ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలకు తెరలేపారని తెలిపారు. పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజల మద్దతును దుర్వినియోగం చేస్తూ, స్వలాభం కోసం పార్టీకి హాని కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎవ్వరినీ నమ్మడం లేదని, ఎవరి మాటలకైనా లోనవడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు చూస్తే పార్టీలో ఆత్మపరిశీలన చేయాల్సిన అవసరం ఎంతవారిదో తెలుస్తోందన్నారు.
“ఇలాంటి తప్పుడు పనులు చేసే ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు. పార్టీని మోసం చేసే వారిని క్షమించేది లేదని ఆయన పేర్కొన్నారు. మరి ఆ కోవర్టులు ఎవరనేది తెలియాల్సి ఉంది.