Chandrababu Naidu : మంత్రి రోజా డబ్బు కోసం ఏమైనా చేస్తుంది – చంద్రబాబు నాయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : మంత్రి రోజా డబ్బు కోసం ఏమైనా చేస్తుంది – చంద్రబాబు నాయుడు

 Authored By aruna | The Telugu News | Updated on :28 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : మంత్రి రోజా డబ్బు కోసం ఏమైనా చేస్తుంది - చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని పీలేరులో ‘ రా కదలిరా ‘ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై తారస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మంచి మంత్రి కూడా లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం మంత్రి తమ సొంత కార్యకర్తల వద్ద నామినేటెడ్ పదవుల కోసం లంచం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే పాపాల పెద్దిరెడ్డి అంటూ రామచంద్రారెడ్డి పై నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పాపాల పెద్దిరెడ్డి అన్నంకి బదులు ఇసుకే తినేటట్లు ఉన్నాడంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఉదయం ఇసుక, మధ్యాహ్నం మైన్స్, రాత్రి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా అన్నింటిలోనూ ఆ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఒకప్పుడు ఉన్న బకాసురుడిని ఈ పాపాల పెద్దరెడ్డి మించిపోయాడని నిప్పులు చెరిగారు. తన దయదాక్షిణ్యాల వలన పెద్దిరెడ్డి ఇప్పటివరకు గెలిచాడని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక శిఖండ నాయకుడిలా అవతరించారని అసలు అతను ఒక నాయకుడేనా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించినందుకు 600 మంది పైన తప్పుడు కేసులు పెట్టించాడని, అందులో విద్యార్థులతో పాటు ముసలి వాళ్లు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాపాల పెద్దిరెడ్డి పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేడని అన్నారు. ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డికి అధికారం ఉండదని, చేసిన తప్పులకి అతన్ని శిక్షించే బాధ్యత తనదేనని చంద్రబాబు అన్నారు.

సైకోని నమ్ముకుని చేసిన అరాచకాలకు సమాధానం చెప్పక తప్పదు అన్నారు. టీడీపీ అంటే ఏంటో తాను అంటే ఏంటో చేసి చూపిస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే లేరని కానీ జనం సిద్ధం అంటూ జగన్ చెప్తున్నారని అన్నారు. జగన్ ఎంత సిద్ధమయ్యాడో తెలియదు కానీ అతడిని ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ నిన్ను ఇంటికి పంపడానికి అన్నదాతలు, నిన్ను తరిమి కొట్టడానికి యువత, నీ అహంకారాన్ని అణిచివేయడానికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, ఈ యుద్ధానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది