Chandrababu : చంద్రబాబు ఇలాకాలో దారుణం… ఘటనపై సీరియస్ అయిన సీఎం..!
ప్రధానాంశాలు:
Chandrababu : చంద్రబాబు ఇలాకాలో దారుణం... ఘటనపై సీరియస్ అయిన సీఎం..!
Chandrababu : చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఓ మహిళతో దారుణంగా ప్రవర్తించాడు . నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసాడు వడ్డీ వ్యాపారి. మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు ఎక్కువయ్యాయి.

Chandrababu : చంద్రబాబు ఇలాకాలో దారుణం… ఘటనపై సీరియస్ అయిన సీఎం..!
Chandrababu ఇంత దారుణమా?
అయితే అప్పు తీర్చేందుకు కూలి పని చేస్తూ అప్పు కడుతోంది శిరీష. ఇక టైమ్ కి డబ్బులు చెల్లించడం లేదని శిరీషను బూతులతో దూషిస్తూ చెట్టుకు కట్టేసాడు వడ్డీ వ్యాపారి. మునికన్నప్ప అని తెలుస్తుండగా, అతను ఆమెని ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేశాడట. దీంతో మునికన్నప్పపై వైసీపీ నేతలతో పాటు స్థానికులు కూడా మండిపడుతున్నారు.
సభ్యసమాజం సిగ్గుపడేలా ఒక మహిళతో ఇలా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. అయితే కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మహిళను కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్త
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం
చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం
నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)
భర్త తిమ్మరాయప్ప… https://t.co/f0u0T890LT pic.twitter.com/qv0CpPIBnP— Telugu Scribe (@TeluguScribe) June 17, 2025