
chandrababu shcking comments about alliance with bjp
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మేటర్ లోకి వెళ్తే అధికారంలో ఉన్న వైసీపీ ఎప్పటిలాగా యధావిధిగా సింగిల్ గానే పోటీ చేయబోతున్నట్లు.. ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు పొత్తులతో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని దించేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ జనసేన పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ కూడా కలవబోతున్నట్లు.. 2014 మాదిరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా దేశంలో బీజేపీ పార్టీ పట్ల ప్రజలలో భారీ ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లు కొన్ని సర్వేలలో వస్తున్న ఫలితాలు బట్టి తెలుస్తోంది. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ కాస్త జాగ్రత్త పడుతున్నట్లు లేటెస్ట్ గా చంద్రబాబు వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది.
మేటర్ లోకి వెళ్తే ఇటీవల కేంద్ర మంత్రి నారాయణస్వామి అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు ఉంటాయని..టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేయబోతున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులతో చంద్రబాబు తాజాగా చిట్ చాట్ లో మాట్లాడటం జరిగింది. దగా పడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రజలలో అవగాహన చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయడమే తన ముందున్న లక్ష్యం అని స్పష్టం చేశారు. తనపై పెద్ద బాధ్యత ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలు అవసరం.. ఎవరెవరో ఏదో మాట్లాడితే.. దానికి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ..బీజేపీ కేంద్ర మంత్రి పొత్తు వ్యాఖ్యలను చంద్రబాబు చాలా లైట్ తీసుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గత కొద్ది నెలల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తహ తహాలాడారు.
chandrababu shcking comments about alliance with bjp
ఈ క్రమంలో చాలాసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షా, మోదీ అపాయింట్మెంట్ కోసం కొన్ని గంటలు కూడా వేచి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాని ఇటీవల కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఘోరంగా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మరోపక్క దేశ వ్యాప్తంగా ఈ రీతిగానే బీజేపీ విధానాలపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం.. విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ ద్రోహం చేసిందనే ఆగ్రహం ఏపీ ప్రజలలో నెలకొంది. ఈ కారణంతో బీజేపీ పై రాష్ట్ర ప్రజలు అక్కసుతో ఉన్నారని ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జగన్ కే లాభమని చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.