YS Jagan – Chandrababu : జగన్ నోట్లోంచి ‘ఆ పేరు’ వస్తే భయపడిపోతోన్న చంద్రబాబు..!
YS Jagan – Chandrababu : ఏపీలో ప్రస్తుతం సీఎం జగన్ ను, ఆయన పాలనను, వైఎస్సార్సీపీ పార్టీని ప్రజలు మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు. అవును.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చెందని కుటుంబం లేదు. ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరినవే. ఏదో ఒక రూపంలో ఏపీలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
ఒకవేళ ఎవరైనా ఏ సంక్షేమ పథకాన్ని పొందకపోతే.. అటువంటి వాళ్లకు కూడా ఒక సరికొత్త సంక్షేమ పథకాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. అంటే.. ఏపీలోని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సీఎం జగన్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు చేకూరాల్సిందే. వాళ్లకు సంక్షేమ పథకాలు రావాల్సిందే. అలాంటి నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారు. చంద్రబాబునాయుడు అందుకే మహానాడు వేదికగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాం అని చెబుతున్నారా?
YS Jagan – Chandrababu : అందుకే చంద్రబాబు భయపడుతున్నారా?
ప్రస్తుతం ఉన్న స క్షేమ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చంద్రబాబు ఎందుకు స్పష్టం చేసినట్టు. అంటే.. సీఎం జగన్ పథకాలు చూసి చంద్రబాబుకు కూడా వణుకు పుడుతోందనే అనాలి. నిజానికి ఈ పథకాలను కొనసాగించాలన్నా.. మరిన్ని పథకాలను తీసుకురావాలన్నా అది చంద్రబాబుకు చాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఏమాత్రం తేడా కొట్టినా టీడీపీ పని అయిపోయినట్టే. అందుకే టీడీపీని ఇన్ డైరెక్ట్ గా తన సంక్షేమ పథకాలతో సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారు. అసలు చంద్రబాబు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారో క్లారిటీ ఇవ్వలేదు. అలాంటప్పుడు చంద్రబాబును ఎలా ప్రజలు నమ్ముతారు అనేది ఏపీ ప్రజలకు కూడా స్పష్టం కావడం లేదు.