Annadata Sukhibhava : రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ 20 వేలు
ప్రధానాంశాలు:
Annadata Sukhibhava : రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లో రూ 20 వేలు
Annadata Sukhibhava : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర రైతులకు శుభవార్త అందించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు ముహూర్తం ఖరారు చేశారు. ఎన్‌డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పథకం అమలులో భాగంగా రైతు ఖాతాలో నిధుల జమ గురించి చంద్రబాబు తాజాగా స్పష్టత ఇచ్చారు. దీంతో పాటుగా తల్లికి వందనం పథకం అమలు గురించి వెల్లడించారు. మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలులో భాగంగా నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న దృష్ట్యా పీఎం కిసాన్ తో కలిపి రైతులకు ప్రభుత్వం నగదు అందించనుంది.

Annadata Sukhibhava : రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ 20 వేలు
ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కోసం రూ 9,400 కోట్లు ప్రతిపాదించింది. అయితే కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా అర్హతలు, మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడతగా వచ్చే నెలలో నిధులు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
తల్లికి వందనం
ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలు పైన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ రూ.4 వేలకు పెంచి అమలు చేస్తున్న అంశాన్ని గుర్తు చేశారు. రూ.64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి రూ.10 వేలు, రూ.15 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. మహిళలకు త్వరలోనే తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. వచ్చే నెలలో ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నిధులు జమ చేయనున్నారు.