chiranjeevi : పవన్‌తో కలిసి నడవాలనుకున్న చిరుకు చిరాకు తప్పట్లేదు..!
chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం పెట్టి నిరాశ పర్చాడు. తక్కువ సమయంలోనే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో మర్జ్ చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. రాజకీయాల నుండి దూరం జరిగిన చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు చేయడం లేదు అంటూ గతంలో ప్రచారం జరిగింది. కాని ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని గతంలో ఉన్న రాజకీయ అనుభవం మరియు ఇతర విషయాల కారణంగా చిరంజీవి ఎంత కావాలనుకున్నా కూడా పవన్ తో కలిసి నడువలేని పరిస్థితి కనిపిస్తుంది.
chiranjeevi : విశాఖ స్టీల్ ఇష్యూ..
ఏపీలో బీజేపీ మరియు జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. కనుక విశాఖ స్టీల్ విషయమై జనసేన పార్టీ తన వాయిస్ ను వినిపించేందుకు సిద్దంగా లేదు. పైకి ఆందోళనలు చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి వ్యతిరేక గళం వినిపించేందుకు మాత్రం సిద్దంగా లేరు అనడంలో సందేహం లేదు. అందుకే జనసేన పార్టీ నుండి ఇప్పటి వరకు ఆ విషయమై పెద్ద ఎత్తున విమర్శిస్తున్న వారు లేరు. విశాఖ స్టీల్ వ్యవహారం కు కారణం ఖచ్చితంగా వైకాపా ఎంపీల చేతకాని తనం అంటూ వ్యాఖ్యలు చేస్తు వస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు బీజేపీ కారణం అంటూ విమర్శలు చేయడం జరిగింది. చిరంజీవి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేనకు కూడా ఆయన దూరం అయినట్లుగా భావించవచ్చు.
బీజేపీ విషయమై చిరు అసంతృప్తి.. : vishaka steel plant
గతంలో కాంగ్రెస్ పార్టీ తో కలిసి చిరంజీవి పని చేశాడు. కనుక ఖచ్చితంగా బీజేపీతో విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు మళ్లీ మళ్లీ పెరుగుతూ వచ్చాయి. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ మరియు బీజేపీలు కలిసి పని చేస్తున్న సమయంలో జనసేనలో చిరంజీవి కలవడం అనేది కష్టం అయిన పని. అందుకే చిరంజీవి జనసేన కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చిరంజీవి అధికారికంగా పవన్ కు మద్దతు పలికిన సందర్బాలు లేవు. వచ్చే ఎన్నికల్లో అయినా చిరంజీవి నుండి పవన్ కు మద్దతు లభిస్తుందేమో చూడాలి. అప్పుడు కూడా బీజేపీ వల్ల చిరు దూరం ఉంటాడా అనేది చూడాలి.