Tree : ఈ చెట్టు కనిపిస్తే భయంతో వణికిపోతున్న విశాఖ వాసులు.. మరి ముఖ్యంగా చలికాలంలో .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tree : ఈ చెట్టు కనిపిస్తే భయంతో వణికిపోతున్న విశాఖ వాసులు.. మరి ముఖ్యంగా చలికాలంలో ..

 Authored By aruna | The Telugu News | Updated on :13 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Tree : ఈ చెట్టు కనిపిస్తే భయంతో వణికిపోతున్న విశాఖ వాసులు.. మరి ముఖ్యంగా చలికాలంలో ..

Tree  : ఏడు ఆకుల పాల చెట్టు అడవిలో పుట్టిన ఈ వృక్షాన్ని ఆదిమ జాతి గిరిజనులు దెయ్యం చెట్టు అని పిలుస్తారు. దీని పుప్పొడి రేణువులు మానవాళికి అత్యంత ప్రమాదకరముని, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అలర్జీ వస్తుందని పరిశోధనలలో తేలింది. ఏడు ఆకుల చెట్టు కింద ఎక్కువసేపు కూర్చుంటే ఊపిరితిత్తుల్లో పుప్పొడి రేణువుల పేరుకుపోయి స్పృహ కోల్పోతారని తేలింది. భవిష్యత్తులో ఈ మొక్కలను నాటవద్దని అటవీశాఖ నిర్ణయించింది. 2014 తుఫాను తర్వాత పచ్చదనం కోసం విశాఖలో నాటిన మొక్కలలో ఒకటి ఈ ఏడు ఆకుల పాల చెట్లే ఎక్కువ. ఇది చాలా వేగంగా పెరుగుతుంది. అయితే కొన్నాళ్ళకు ఈ చెట్లకు పూలు పూస్తాయి ఆ పూల వాసన చాలా చెడుగా ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

గుత్తులు గుత్తులుగా పూస్తున్న ఈ పూల వలన వచ్చే గాలి ఊపిరి ఆడకుండా చేస్తుంది అని విశాఖవాసులు చెబుతున్నారు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ చెట్లకు పెద్ద ఎత్తున పూలు పూస్తాయి. వీటి వలన శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఇది శాస్త్రీయ నిరూపితం కాలేదని కొందరు చెబుతున్నారు. ఒకే చోట 50,వంద చెట్లు నాటినప్పుడు వాటి నుంచి వచ్చే పూల వాసన భరించలేక చాలామందికి సైనస్, శ్వాసకోస ఇబ్బందులు వస్తున్నాయి. గుత్తులు గుత్తులుగా పోస్తున్న ఆ పూల నుంచి పుప్పొడి ముక్కులలోకి, చర్మం మీద పడటం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయా అనేది పరిశోధన చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అందరికీ అనారోగ్యం అని చెప్పడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. అలా అని ఆరోగ్యమైనదని కూడా చెప్పలేము అని అంటున్నారు. పెరిగిన తర్వాత ఈ చెట్టు నుంచి భరించలేని వాసన వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ చెట్టు కలపను పిల్లల పలకలు, బ్లాక్ బోర్డులు, చెక్కల తయారీకి వినియోగిస్తారు. ఈ చెట్టును కొన్ని జాగ్రత్తలు తీసుకొని నాటాలని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు పై ఫిర్యాదులు వస్తున్న చోట జీహెచ్ఎంసి వాళ్ళు తొలగించినట్లు చెబుతున్నారు. అక్కడ ఏడు ఆకుల పాల చెట్లకు బదులుగా వేప మొక్కలు నాటామని జిహెచ్ఎంసి వాళ్ళు తెలిపారు. ఈ ఏడు ఆకుల పాల చెట్టు వలన కిడ్నీ ఊపిరితిత్తులు చర్మ కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ చెట్టుకు చలికాలంలో పువ్వులు పూస్తాయి. ఈ పూల వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే సీజన్ అయిపోయేంతవరకు దీనికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది