TDP and JANASENA : కూటమిలో కనిపిస్తున్న ఈగో పాలిటిక్స్… నష్టం ఎవరికి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP and JANASENA : కూటమిలో కనిపిస్తున్న ఈగో పాలిటిక్స్… నష్టం ఎవరికి..!

 Authored By aruna | The Telugu News | Updated on :30 January 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP and JANASENA : కూటమిలో కనిపిస్తున్న ఈగో పాలిటిక్స్... నష్టం ఎవరికి..!

TDP and JANASENA : ఏపీలో టీడీపీ జనసేన కలవడం విన్నింగ్ కాంబినేషన్ అనుకున్నారు.కానీ పొత్తులో అంటే అంతర్గతంగా ఎంత పోట్లాడిన బయట మాత్రం స్మూత్ గా సాగిపోవాలి. ఒకరిపై ఒకరు ధ్వేశం పెంచుకునేలా రాజకీయం చేస్తే ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ కాదు.అదే జరిగితే పొత్తుల వల్ల ప్రయోజనమే ఉండదు.అయితే ఇప్పుడు ఈగో లకు పోతున్న టిడిపి జనసేనల మధ్య అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి తాను రెండు సీట్లు ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ కార్యకర్తల్లో అభిమానుల్లో క్యాడర్లను సంతృప్తి పరచడానికి సినిమాల డైలాగులతో ప్రకటన చేశారు. ఆ తర్వాత సాయంత్రానికి ఆయన సోదరుడు నాగబాబు ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరిక జారీ చేశారు. ఈ సోదరుల రాజకీయం చూసిన తర్వాత సహజంగానే టీడీపీ కేడర్ కు మండిపోయింది. వీరితో పెట్టుకుంటే జరిగేదేమి ఉండదని వారి నీ అలాగే వదిలేయాలని డిమాండ్లు ప్రారంభమయ్యాయి. కేవలం ఎన్నికల గురించి కాదని తర్వాత కలిసి పని చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు వీరిని కొడితే అస్సలు సాగని పరిస్థితి కాబ్బటి అక్కడి వరకు తెచ్చుకోకుండా తెంపేసేయడమే బెటర్ అని సలహాలు ఎక్కువగా ఇస్తున్నారు. కానీ టిడిపి అధినేత సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ పట్టించుకోలేదు.ఇగో అనే కాన్సెప్ట్ తో కృషి అనే సినిమా కి సూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఈగో రాజకీయ పాత్రల మధ్య కూడా ఉంటే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారేమో కానీ ఇది సినిమా కాదు అనే సంగతి ఆయన గుర్తు చేసుకుంటే బెటర్. రెండు చోట్ల పోటీ చేయాలి అనుకుంటే ఆ రెండు చోట్ల పోటీ చేస్తాం అని చెప్పడం వేరు కాని చంద్రబాబు ప్రకటించారు అని మేము ప్రకటిస్తాం అని చెప్పడం వేరు.

పొత్తు ధర్మం గురించి మాట్లాడే అంత ఏం జరిగిందని నిలకడలేని వ్యవహారాలు రాజకీయాలు ఇప్పుడు ఏం చేస్తారు అని తెలియని మాటలతో గందరగోళ పడే పవన్ రాజకీయల లో మాటలను కూడా పొదుపుగా వాడాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఇక ఏ పొత్తులోనైనా సరే సిట్టింగ్ స్థానాలను ఎవరు వదులుకోరు. మండపేట సిట్టింగ్ అలాంటి ఇలాంటిది కాదు. కంచుకోట ప్రజారాజ్యం ఉన్న సమయంలోను టిడిపి గెలిచింది. అలాంటిది ఎలా ఇస్తారు అనుకున్నారు…? అరకు నియోజకవర్గంలో జనసేనకు కనీసం మద్దతు ఉందా…? ఈ రెండు చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం పొత్తు ధర్మ ఉల్లంగించడం ఎలా అవుతుంది. ఒక రాక్షసుడిని ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి మాటలతో ఎవరైనా సొంత కుంపటి పెట్టుకుంటారా..? కానీ పవన్ కళ్యాణ్ పెట్టుకుంటారు నాగబాబు కూడా పెట్టుకుంటారు వారికి అసలు శత్రుభయ పోరాటం కన్నా ఓటమికి దగ్గర దారులను ఎదుర్కోవడం చాలా ఇష్టం. పొత్తు బలహీన పడితే నష్టం ఎవరికీ జనసేన పార్టీకి. టిడిపికి నష్టం లేదు. ఏపీకే నష్టం మరోసారి జగన్ వస్తే ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో ఇప్పటికే శాంపుల్ గా చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బలానికి తగ్గట్టుగా వ్యవహరించకుండా గోలకు పోయి ఎవరినో సంతృప్తి పరచడానికి స్టేట్మెంట్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది.

అయినా తమ బలం పెరిగిపోయింది అనుకునే జనసేన కేడర్ తెలంగాణలోని పలితాన్ని గుర్తుకు తెచ్చుకుంటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు . పవన్ కి వచ్చే జనం అందరు ఓటర్లు కాదని కోదాడలో పవన్ టూర్ కి వేల మంది వస్తే వచ్చిన ఓట్లు 100 లోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అదే ఫార్ములా ఏపీ లోను వర్కౌట్ అవుతుందని అంటున్నారు. రాజకీయాల్లో ఎదుటివారు తప్పులు చేస్తే ఒకరు వినియోగించుకోవాలి అలా అని తప్పులు చేసి ఎదురు వారికి అస్త్ర సన్యాస్యమే చేసుకోవాలి. టిడిపి జనసేన కూటమిలో ఇప్పుడు అదే కనిపిస్తుంది. అయితే వైసిపి నేతలు ఈ గొడవలు కూడా చంద్రబాబు ప్లాన్ లో భాగమే అని చెబుతున్నారు. ఏమాత్రం తగ్గడం లేదు అని జనసేనకు ప్రాధాన్యత లభిస్తుంది అని కాపు వర్గాన్ని నమ్మించడానికి ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. రాజకీయ వ్యూహాలు అంతు పట్టనివిగా ఉంటాయి కాబట్టి ఎవరి విశ్లేషణలు వారికి ఉంటాయి కానీ పొత్తుల్లో సామరయస్యం ఉండలేకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది అనేది బేసిక్ ప్రిన్సిపుల్ చెబుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ఏ విధంగా విజయం సాధిస్తుందో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది